Share News

సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణరావు మృతి

ABN , Publish Date - Jul 13 , 2025 | 01:01 AM

తెలంగాణ సా యుధ పోరాటం యోధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు దొడ్డా నారాయణరావు మృతి పార్టీకి తీరని లో టని, నారాయణరావు నేటి యువతకు ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు.

 సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణరావు మృతి

సీపీఐ సీనియర్‌ నాయకుడు నారాయణరావు మృతి

నారాయణరావు ఆదర్శప్రాయుడు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

మృతికి పార్టీలకతీతంగా నివాళులు

అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మావతి

కోదాడ, జూలై 12(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సా యుధ పోరాటం యోధుడు, సీపీఐ సీనియర్‌ నాయకుడు దొడ్డా నారాయణరావు మృతి పార్టీకి తీరని లో టని, నారాయణరావు నేటి యువతకు ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. శుక్రవారం రాత్రి సీపీఐ సీనియ ర్‌ నాయకుడు దొడ్డా నారాయణరావు (96) చి లుకూరులో మృతిచెందారు. శనివారం మధ్యా హ్నం జరిగిన ఆయన అంతిమయాత్రలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొని మా ట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీల క పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి, ప్రజానాయకుడిగా, సీపీఐ నాయకుడిగా ప్రజల గుండె లో చెరగని ముద్ర వేసుకున్నాడని అన్నారు. అ లాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొ ని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నా రు. రజాకార్లకు, పెత్తందార్లకు వ్యతిరేకంగా పో రాటం చేశారని గుర్తు చేశారు. అంతేకాక సారా ఉద్యమంలో కీలక పాత్ర పోషించటంతో పాటు, గ్రంథాలయ ఏర్పాటుకు చదువు, వెలుగులో పా ల్గొని తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నారాయణరావు మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. ఎన్నో ఏళ్లు పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహా మనిషి దొడ్డా అని కొనియాడారు. ఉమ్మ డి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతంతో నారాయణరావు తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారని అన్నారు. అంతకుముందు నాయకులు నా రాయణరావు గృహంలో నారాయణరావు మృతదేహంపై పార్టీలకతీతంగా పలువురు నాయకు లు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుం బ సభ్యులకు సానుభూతి తెలిపారు. అంతిమయాత్రలో పార్టీలకతీతంగా గ్రామస్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పాడె మోసిన నారాయణ

దొడ్డా నారాయణరావు పాడెను సీపీఐ జాతీ య కార్యదర్శి కె.నారాయణ మోశారు. ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణరావు లాంటి మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

నివాళులర్పించిన ప్రముఖులు

దొడ్డా నారాయణరావు మృతి పట్ల మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేనేప ల్లి చందర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్‌, యా దగిరిరావు, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ పార్టీ జాతీయ కౌన్సిల్‌ సభ్యులు పశ్య పద్మ, వనజ, గన్నా చంద్రశేఖర్‌, బొమ్మగాని ప్రభాకర్‌, డీసీసీబీ మాజీ చైర్మన ముత్తవరపు పాండురంగారావు, కోదాడ మాజీ సర్పంచ యర్నేనిబాబు, పీసీసీ డెలిగేట్‌ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, బెజవాడ వెంకటేశ్వర్లు, శ్రీరాములు, పల్లా నర్సింహారెడ్డి, సృజన, కొండయ్య, కొండలుతో పాటు పలువురు మాజీ జడ్పీటీసీలు, ప్రజా ప్రతినిధు లు, వైద్యులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 13 , 2025 | 01:01 AM