Share News

Senior Congress leader T Jeevan Reddy: పార్టీలో మేం వలసదారులం కాదు.. పట్టాదారులం

ABN , Publish Date - Oct 22 , 2025 | 04:21 AM

కాంగ్రెస్‌లో మేము వలసదారులం కాదు. పట్టాదారులం అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టీ. జీవన్‌రెడ్డి అన్నారు...

Senior Congress leader T Jeevan Reddy: పార్టీలో మేం వలసదారులం కాదు.. పట్టాదారులం

  • ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టడమేంటి

  • మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను కలిసి జీవన్‌రెడ్డి ఆవేదన

జగిత్యాల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రె్‌సలో మేము వలసదారులం కాదు. పట్టాదారులం’’ అని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టీ. జీవన్‌రెడ్డి అన్నారు. దశాబ్దకాలంగా బీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు కాకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి నామినేటెడ్‌ పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగిత్యాలలో ఫిరాయింపుదారులకు పదవులు కట్టబెట్టుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ను జీవన్‌రెడ్డి కలిసి పలు రాజకీయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యమిస్తామని అధిష్ఠానం చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అలా జరగడం లేదని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీర్‌పూర్‌ లక్ష్మీనృసింహస్వామి దేవస్థాన అభివృద్ధి కమిటీ పదవులను ఫిరాయింపుదారులకు కట్టబెట్టారని విమర్శించారు. కాగా, జీవన్‌రెడ్డి ఆవేదనను అధిష్ఠానానికి వివరిస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 04:33 AM