kumaram bheem asifabad- అట్టహాసంగా ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక పోటీలు
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:57 PM
సింగరేణి పాఠశాల మైదానంలో 44వ సబ్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-14 సంవత్సరాల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు క్రీడాకారులు హాజరయ్యారు.
రెబ్బెన, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): సింగరేణి పాఠశాల మైదానంలో 44వ సబ్ జూనియర్ బాల బాలికల జట్ల ఎంపిక పోటీలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్-14 సంవత్సరాల బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలకు క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఆదిలాబాద్ జిల్లా సబ్ జూనియర్ జట్లు ఈ నెల 13 నుంచి 14 వరకు జనగామ జిల్లా కూనూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి ఆదిలబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు. ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాల్ బాడ్మింటన్ ఎంపిక పోటీలకులకు అతిథులకు బీజేపీ వైస్ ప్రసిడెంట్ గుల్బం చక్రపాణి, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, ఒలింపిక్ వర్కింగ్ అధ్యక్షులు ఆర్.నారాయణరెడ్డి, షార్ప్ స్టార్ అధ్యక్షులు వి.మహేందర్ రెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఫ బాలికల జట్టుకు ఎం సహస్ర, టి ప్రజ్వల, శ్రావ్య, ఎస్ సాయి శ్రీ, వర్షిణి, వేరోనికా, హన్నా, సిరి, రాజేశ్వరి, పవిత్ర, అల్వీన, ఎస్ రిషిత, నందిని, విజయ స్పూర్తి, బేభా ఎంపికయ్యారు.
ఫ బాలుర జట్టుకు సీహెచ్ వరుణ్, సీహెచ్ నిఖిల్, ఎం కృష్ణ, లోకనందు, అఖిల్, రాఘవ, ఆంజనేయులు, స్టేఫెన్, ఆశ్విన్, తిరుపతి, అరవింద్ డి విష్ణువర్ధన్, త్రిచూర్ కృష్ణ ఎంపికయ్యారు.
సెపక్ తక్రా జట్ల ఎంపిక పోటీలు
రెబ్బెన, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెపక్ తక్రా పురుషులు, మహిళల జట్ల ఎంపిక పోటీలు సింగరేణి హైస్కూల్ గ్రౌండులో నిర్వహించినట్టు ఆదిలాబాద్ జిల్లా సెపక్ తక్రా ఆర్గనైజేషన్ సెక్రెటరి కె మల్లేష్ తెలిపారు. ఇక్కడ ఎంపికైన వారు ఈ నెల 20 నుంచి 22 వరకు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి పట్టణం గవర్నమెంటు పాలిటెక్నిక్ గ్రౌండులో అంతర్ జిల్లాల టోర్నిలో పాల్గొంటారని తెలిపారు. సెపక్‌తక్రా పోటీలకు ముఖ్య అతిథులుగా రెబ్బెన మండల బీఆర్‌ఎస్ అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు. ఈ ఎంపికైన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ వర్కింగ్ అధ్యక్షులు ఆర్ నారాయణ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సెపక్‌తక్రా జాయింట్ సెక్రెటరీ శిరీష, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అభినందించారు.
ఫ సెపక్ తక్రా జిల్లా పురుషుల జట్టుకు రాజేందర్, ఆర్.వెంకటేష్, చందు, రాజశేఖర్, రాందాస్ ఉన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ సెపక్‌తక్రా ఆదిలాబాద్ సెపక్‌తక్రా మహి ళ జట్టు టి అనూష, కె స్పూర్తి, కారుణ్య, నిహశ్రీ, అభినవ, రమ్య, కె.శ్రీవల్లి ఎంపికైనట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెపక్ తక్రా ఆర్గనైజేషన్ సెక్రటరి కుమ్మరి మల్లేష్ తెలిపారు.