రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:02 AM
బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని క్లియో స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పోటీలు ముగిసినట్లు కోచ్ మారబోయిన రామకృష్ణ తెలిపారు.
మిర్యాలగూడ టౌన్, జూన్ 2(ఆంఽధ్రజ్యోతి): బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని క్లియో స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి పోటీలు ముగిసినట్లు కోచ్ మారబోయిన రామకృష్ణ తెలిపారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపైర్ల కమిటీ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసింది. అండర్ 11, 13, 15 బాలబాలిక విభాగాల్లో ఆరుగురు, అండర్ 17 బాలబాలిక విభాగాల్లో 8 మంది, అండర్-19 విభాగంలో ఆరుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. పురుషుల విభాగంలో నలుగురు, మహిళల విభాగంలో ఇద్దరు క్రీబాకారులు స్టేట్ లెవల్‌కు ఎంపికైనట్లు తెలిపారు. కాగా ఎంపికైన క్రీడాకారులను అధ్యక్షుడు డాక్టర్ ప్రశాంత్, గౌరవాధ్యక్షుడు డాక్టర్ అంజయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ. శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. కార్యక్రమంలో మధుబాబు, నవీన్‌కుమార్, ప్రణీత్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.