Share News

kumaram bheem asifabad- సీజ్‌ చేసిన మద్యం ధ్వంసం

ABN , Publish Date - Jul 02 , 2025 | 11:27 PM

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చంతలమానేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో పట్టుబడిన మద్యం సీసాలను బుధవారం పోలీసులు రోడ్డురోలర్‌తో ధ్వంసం చేశారు.

kumaram bheem asifabad- సీజ్‌ చేసిన మద్యం ధ్వంసం
కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో రోడ్డురోలర్‌తో ధ్వంసం చేస్తున్న మద్యం సీసాలు

చింతలమానేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చంతలమానేపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో పట్టుబడిన మద్యం సీసాలను బుధవారం పోలీసులు రోడ్డురోలర్‌తో ధ్వంసం చేశారు. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో అధికారుల అందిన సమాచారం మేరకు చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో తనిఖీ చేశారు. గ్రామంలో నలుగురు వ్యక్తులు తమ ఇళ్ల వద్ద అక్రమంగా నిల్వ చేసిన రూ.21,50,890 విలువ చేసే మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన మద్యాన్ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో నిల్వ ఉంచారు. న్యాయ పరమైన ప్రక్రియ పూర్తి కావడంతో నాలుగు కేసులకు సంబంధించి సీజ్‌ చేసిన రూ. 21,50,890 విలువ గల మద్యాన్ని జిల్లా ఎస్పీ కాంతి లాల్‌ పాటిల్‌, ఎకై్ౖౖసజ్‌ అధికారి జ్యోతి కిరణ్‌ సమక్ష్యంలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో వీడియో రికార్డింగ్‌ చేస్తూ ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎక్సైజ్‌ చట్టం 34ఏ, ఆర్‌పీచట్టం 135సీ కింద కేసులు నమోదు చేయగా న్యాయ పరంగా ప్రక్రియ పూర్తి కావడంతో ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజం, కౌటాల సీఐ రమేష్‌, చింతలమానేపల్లి ఎస్సై ఇస్లావత్‌ నరేష్‌, డిప్యూటీ తహసీల్దార్‌ దౌలత్‌, పోలీస్‌ సిబ్బంది, పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 11:27 PM