పేకాట నిలయాలుగా సెగ్రిగేషన్ షెడ్లు....!
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:16 PM
జిల్లా వ్యా ప్తంగా నివాస గృహాలతోపాటు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని వీధుల్లో వెలువడే చెత్తను సేకరించి ని లువ చేసేందుకు ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు ప్ర స్తుతం పేకాటకు నిలయాలకు, మందుబాబులకు అ డ్డాలుగా మారాయి.
బీఆర్‌ఎస్ హయాంలో నిర్మాణం
లక్ష్యం మేరకు పనితీరు లేక నిరుపయోగంగా మారిన వైనం
రూ. 80 కోట్ల మేర ప్రజా ధనం వృథా
-జిల్లాలో పంచాయతీకి ఒక్కటి చొప్పున నిర్మాణం
మంచిర్యాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యా ప్తంగా నివాస గృహాలతోపాటు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లోని వీధుల్లో వెలువడే చెత్తను సేకరించి ని లువ చేసేందుకు ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లు ప్ర స్తుతం పేకాటకు నిలయాలకు, మందుబాబులకు అ డ్డాలుగా మారాయి. కోట్లు వెచ్చించిన ఎంతో ఆర్భాటం గా నిర్మించిన షెడ్లలో లక్ష్యం మేరకు పనితీరులేక ని రుపయోగంగా మారాయి. గ్రామాల్లో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయి, ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుండ టంతో పారిశుఽధ్య సిబ్బంది దాన్ని గ్రామాలకు దూరంగా తరలించాలనే లక్ష్యంతో 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్ర భుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రా మ పంచాయతీలో ఒక్కటి చొప్పున వీటి నిర్మాణానికి పూనుకుంది. గ్రామాల్లో సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లకు తరలించి అక్కడ తడి, పొడిగా వేరు చేసి, తిరిగి ఉపయోగంలోకి తేవాలని నిర్ణయించింది. అయితే ల క్ష్యం మేరకు కార్యాచరణ అమలు చేయకపోవడంతో కోట్లు వెచ్చించి నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి.
రూ. 80 కోట్ల అంచనా వ్యయంతో...
జిల్లా వ్యాప్తంగా అప్పటి 311 పంచాయతీల్లో ఒక్కొ క్కటి చొప్పున సగటున రూ. 2.8 లక్షల నుంచి రూ. 4 లక్షల అంచనాతో మొత్తం దాదాపు రూ. 80 కోట్ల పై చి లుకు వ్యయంతో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యం లో సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం చేపట్టారు. షెడ్ల నిర్మా ణం పూర్తి కావడంతో వాటిని నిర్వహణ కోసం జిల్లా పంచాయతీ శాఖకు అప్పగించారు. గ్రామాల్లో ఇంటిం టా సేకరించిన తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరిం చిన సిబ్బంది దాన్ని సెగ్రిగేషన్ షెడ్లకు తరలించాలి. అ క్కడ తడి చెత్తలో సేంద్రియ ఎరువులు తయారు చేసి అవసరం ఉన్న రైతులకు విక్రయించడం ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే పలు గ్రామాల్లో పారిశుధ్య సి బ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, చెత్త సేకరణకు అవసరమైన వాహనాలు పూర్తిస్థాయిలో అందుబాటు లో లేకపోవడంతోపాటు పర్యవేక్షణ లోపం కారణంగా ఘనమైన లక్ష్యంతో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు ని రు పయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల షెడ్లు గ్రా మాలకు అత్యంత దూరంగా ఉండటం కూడా లక్ష్యం నె రవేరపోవడానికి కారణాలయ్యాయి. మిగతా చోట్లా కొం తకాలంపాటు షెడ్లు వినియోగంలో ఉన్నప్పటికీ ఆ తరువాత పర్యవేక్షణ పూర్తిగా కొరవడి అలంకార ప్రాయంగా మారాయి.
ఆర్భాటంగా నిర్మించి...
బీఆర్‌ఎస్ హాయంలో కోట్ల రూపాయలు వెచ్చించి, ఎంతో ఆర్భాటంగా నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు ఆలనా పాలనా లేక కాల క్రమంలో పేకాటకు నిలయాలుగా మారాయి. జిల్లాలోని అప్పటి వేంపల్లి గ్రామంలో (ప్ర స్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం అయింది) రూ. 2.8 లక్షల అంచనా వ్యయంతో నిర్మిం చిన సెగ్రిగేషన్ షెడ్డు ఊరికి దూరంగా ఉండటంతో అ ది ప్రస్తుతం అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మా రింది. రోడ్డు సౌకర్యం కూడా సక్రమంగా లేకపోవడంతో పారిశుధ్య సిబ్బంది సేకరించిన చెత్తను సమీపంలోని వాగులు, చెరువల వద్ద పడవేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం షెడ్డు ఆవరణలో పెద్ద మొత్తంలో పేకాట ఆ డటం, మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఖాళీ మద్యం సీసాలు, పేకాట ముక్కలు దర్శన మి స్తుండటమే దీనికి నిదర్శనం. షెడ్డు వద్ద నిర్మించిన బా త్రూంలో కూడా మద్యం సీసాలతో నిండిపోతోంది. జిల్లా వ్యాప్తంగా నిర్మించిన అన్ని షెడ్ల పరిస్థితి దాదాపుగా అలానే ఉందంటే అతిశయోక్తి కాదు. పర్యవేక్షణ లోపం కారణంగా జిల్లా వ్యాప్తంగా సెగ్రిగేషన్ షెడ్లు నిర్మాను ష్యంగా మారగా, కోట్లాది రూపాయలు వెచ్చించిన ప్ర భుత్వ లక్ష్యం కూడా నెరవేరడం లేదు.