Share News

బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Sep 22 , 2025 | 10:58 PM

బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ పరిధిలో మహిళలు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో భద్రత ఏర్పా ట్లను పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్‌ విజబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

బతుకమ్మ, నవరాత్రి ఉత్సవాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి
ప్రశంస పత్రం అందజేస్తున్న పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా

మంచిర్యాల క్రైం, సెప్టెంబరు 22(ఆంరఽధజ్యోతి) : బతుకమ్మ, దుర్గామాత నవరాత్రి వేడుకలకు ముందస్తు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి జోన్‌ పరిధిలో మహిళలు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో దుర్గామాత అమ్మవారు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో భద్రత ఏర్పా ట్లను పర్యవేక్షిస్తూ పెట్రోలింగ్‌ విజబుల్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మహిళలపై వే ధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హె చ్చరించారు. ముఖ్యంగా సాయంత్రం బతుకమ్మ ఆడే సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు లు నిఘా పెట్టాలన్నారు. దుర్గామాత నవరాత్రి వేడుకలను శాంతియుత వాతా వరణంలో జరుపుకోవాలని దీని కోసం ముందస్తు భద్రతా ఏర్పా ట్లు పూర్తి చేశామన్నారు.

ఊరికి వెళ్లే వారు సమాచారం అందించాలి....

పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి వెళ్లే ప్రజలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. వారి వివరాల ను నమోదు చేసుకొని వారి ఇండ్లపై నిఘా ఏర్పాటు చేస్తామ న్నారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచా రం అందించాలన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 10:58 PM