kumaram bheem asifabad-పకడ్బందీ ఏర్పాట్లు
ABN , Publish Date - Dec 13 , 2025 | 10:05 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మలి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో రెండో విడత ఆదివారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మలి విడత 113 గ్రామ పంచాయతీ సర్పంచులు, 992 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం, 143 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఆదివారం 112 సర్పంచ్, 837 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.
- పోలింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధం
- విధుల్లో 2,543 మంది సిబ్బంది
- జిల్లాలో ఆరు మండలాల్లో 112 సర్పంచ్, 837 వార్డు స్థానాలకు పోలింగ్
- ఒక పంచాయతీ, 143 వార్డులు ఏకగ్రీవం
ఆసిఫాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మలి విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. జిల్లాలో రెండో విడత ఆదివారం జరిగే పంచాయతీ పోరుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాలో మలి విడత 113 గ్రామ పంచాయతీ సర్పంచులు, 992 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం, 143 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఆదివారం 112 సర్పంచ్, 837 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండో విడత ఎన్నికల్లో 1,31,622 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకో నున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నికల్లో పారదర్శకత కోసం వీడియో కవరేజ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్‌లు ప్రత్యేక బందో బస్తును ఏర్పాటు చేస్తున్నారు.
కాగజ్‌నగర్ డివిజన్‌లోని..
కాగజ్‌నగర్ డివిజన్‌లోని బెజ్జూర్ , చింతలమానేపల్లి , కౌటాల ,సిర్పూర్-టి , పెంచికల్‌పేట , దహేగాం మండలాల్లో రెండో విడతగా ఆదివారం ఎన్నికలు జరిగే 112 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 837 వార్డులకు పోలింగ్ నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసిన అధికారులు సజావుగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగాన్ని సంసిద్దం చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం రెండో విడత ఎన్నికల కోసం 2543 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. వీరిలో 1188 మంది పోలింగ్ అధికారులు, 1355 మంది సహయ పోలింగ్ అధికారులను నియమించారు. జిల్లాలో మలి విడతగా పంచాయతీ ఎన్నికల్లో1,31,622 మంది గ్రామీణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగిం చుకోనున్నారు. మలి విడత ఎన్నికలు జరిగే ఆరు మండలాలో ఆర్టీసీ బస్సులు, ప్రత్యేక వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. . ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఆ తరువాత అధికారులు ఫలితాలను వెల్లడించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మలి విడతగా ఎన్నికలు 113 గ్రామ పంచాయతీ సర్పంచులు, 992 వార్డులు ఉండగా ఇందులో ఇప్పటికే ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం, 143 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 12 వార్డు స్థానాలకు నామినేషన్లు ధాఖ లు కాలేదు. దీంతో 112 సర్పంచ్, 837 వార్డు స్థానాల్లో బరిలో ఉన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్‌లోని బెజ్జూర్ , చింతలమానేపల్లి , కౌటాల ,సిర్పూర్-టి ,పెంచికల్‌పేట , దహెగాం మండలాలోని 112 గ్రా మ పంచాయతీ పదవులకు 425 మంది అభ్య ర్థులు, 837 వార్డులకు 2,140 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మలి విడత పంచాయతీలకు జరిగే ఎన్నికల సందర్భంగా 862 మంది పోలీసు సిబ్బంది బందో బస్తులో పాల్గొనున్నారు. ఇందులో ఎస్పీ, డీఎస్పీలతో పాటు 8 మంది సీఐలు, 23 మంది ఎస్సైలు,133 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 326 మంది కానిస్టేబుళ్ళు 70 మంది హోంగార్డులు,300 మంది ప్రత్యేక పోలీసు బలగాలు పోలింగ్ కేంద్రాల వద్ద విధులను నిర్వహించనున్నారు.
మండలాల వారీగా ఓటర్లు ఇలా..
మండలం పురుషులు స్త్రీలు ఇతరులు మొత్తం
బెజ్జూర్ 11,685 12047 02 23,734
చింతలమానేపల్లి 12,118 11,837 00 23,955
దహెగాం 11,014 11,077 01 22,092
కౌటాల 13,796 13,560 01 27,357
పెంచికల్‌పేట్ 6,218 6,084 00 12,302
సిర్పూర్-టి 11,016 11,163 03 22,182
మొత్తం 65,847 65,768 07 1,31,622