Share News

Central Minister Kishan Reddy: ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

ABN , Publish Date - Nov 11 , 2025 | 02:22 AM

అధునాతన సౌకర్యాలతో ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు....

Central Minister Kishan Reddy: ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌

  • 3 వేల మంది కూర్చునే వెయిటింగ్‌ హాల్‌

  • 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావలేటర్లు సహా నేరుగా మెట్రోతో అనుసంధానించేలా వంతెనలు

  • 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం

  • ఇది హైదరాబాద్‌కు మరో మణిహారం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): అధునాతన సౌకర్యాలతో ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మరో 18 నెలల్లో పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయని, ప్రధాని మోదీ చేతుల మీదుగా రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ పనులను సోమవారం కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి ప్రస్తుతం రోజూ 1.97 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్‌ను రీ డిజైన్‌ చేశామని తెలిపారు. రూ.715కోట్లతో మొదట దశ పునర్మిర్మాణ పనులు చేపట్టినట్టు తెలిపారు. హైదరాబాద్‌కు ఒక మణిహారంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నిలవనుందని పేర్కొన్నారు. 3 వేల మంది ప్రయాణికులు కూర్చునే విధంగా వెయిటింగ్‌ హాలు, క్యాంటీన్‌ స్టాళ్లు, 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, విమానాశ్రయాల్లో మాదిరిగా 2 ట్రావలేటర్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌లోకి వచ్చి వెళ్లేలా, స్టేషన్‌ నుంచి బస్టా్‌పల వరకు కాలినడక వంతెనలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. పనులు పూర్తయితే రైౖల్వే స్టేషన్‌ నుంచి రోజూ 2.70 లక్షల మంది రాకపోకలు సాగించేందుకు అవకాశం ఉంటుందని, ప్రతీ గంటకు 32,500 మంది ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ , సికింద్రాబాద్‌ డివిజన్‌ సెక్యూరిటీ కమిషనర్‌ నవీన్‌ కుమార్‌, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2025 | 02:23 AM