Share News

Secretariat: సచివాలయానికి వరుస సెలవుల ఎఫెక్ట్‌

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:11 AM

క్రిస్మస్‌ పండగ వేళ వరుస సెలవులు రావడంతో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తోంది.

Secretariat: సచివాలయానికి వరుస సెలవుల ఎఫెక్ట్‌

  • బుధవారం నుంచే సెలవులపై ఉద్యోగులు

హైదరాబాద్‌, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్‌ పండగ వేళ వరుస సెలవులు రావడంతో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తోంది. బుధవారం నుంచే సెలవుల సందడి మొదలవడంతో కార్యాలయాల్లో సందడి తగ్గింది. తిరిగి సోమవారం నుంచే మళ్లీ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 25న క్రిస్‌మస్‌, 26న బాక్సింగ్‌ డే (ఫాలోయింగ్‌ డే), ఆపై శని, ఆది వారాలు రావడంతో.. చాలా విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు సెలవులపై వెళ్లారు. మధ్యలో శనివారం ఒకరోజు పనిదినం అయినప్పటికీ, చాలా మంది ఉద్యోగులు తమకున్న ఐచ్ఛిక సెలవులను వాడుకున్నారని తెలిసింది. ఎప్పుడూ విజిటర్లతో, ఫైళ్లతో బిజీగా ఉండే సచివాలయ కారిడార్లు వరుస సెలవుల నేపథ్యంలో బోసిపోయి కనిపించాయని, పునర ్ధర్శనం సోమవారమేనంటూ సచివాలయంలో చర్చ జరిగింది.

Updated Date - Dec 25 , 2025 | 05:11 AM