Seethakka: త్వరలోనే రెండో విడత పనుల జాతర
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:49 AM
గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అభివృద్ధి చర్యల్లో భాగంగా త్వరలోనే రెండో విడత...
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు అభివృద్ధి చర్యల్లో భాగంగా త్వరలోనే రెండో విడత ‘పనుల జాతర’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది చేపట్టిన పనుల జాతరలో ఉపాధి హామీ ద్వారా కూలీలకు మొత్తం 12.23 కోట్ల పనిదినాలు కల్పించామని, అభివృద్ధి పనుల కోసం రూ.4529.07 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. అందులో కూలీల వేతనాలకు రూ.2,614.3 కోట్లు, సామగ్రికి రూ.1,685.52 కోట్లు, నిర్వహణకు రూ.229.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ దఫా పనుల జాతరలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మహిళలకు ఉపాధి కల్పన, జలనిధి కింద నీటి సంరక్షణ పనులతో పాటు, వ్యవసాయ పోలాలకు బాటల నిర్మాణం, ఫలవనాల పెంపకం చేపడతామన్నారు.