Share News

ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:26 AM

జిల్లాలో రెండో విడ త సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణం కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు.

ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు
వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌సరళిని పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెండో విడ త సర్పంచు, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణం కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పేర్కొన్నారు. ఆదివారం కలె క్టరేట్‌ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రా లను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. పోలింగ్‌ సరళి, కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్‌, వేమనపల్లి మండలాల్లో సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిం దన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షించామన్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, ఎన్నికల అధికారులు ఉన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 12:27 AM