kumaram bheem asifabad- రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:51 PM
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత ఎన్నికల నిర్వహణ జిల్లాలో ప్రశాంంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆదివారం రెండో విడతలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సాధారణ పరిశలకులు శ్రీనివాస్‌తో కలిసి వెడ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత ఎన్నికల నిర్వహణ జిల్లాలో ప్రశాంంగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆదివారం రెండో విడతలో జరుగుతున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ సరళిని ఎన్నికల సాధారణ పరిశలకులు శ్రీనివాస్‌తో కలిసి వెడ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో రెండో విడతలో భాగంగా ఆరు మండలాల్లో గల గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలకు 1,31,258 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. పోలింగ్ కేంద్రాలలో వరుస క్రమంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా క్యూలైన్‌లు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు సూచిం చారు. ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆయన వెంట అదనపు ఎన్నికల అధికారి డీపీవో భిక్షపతిగౌడ్, తదితరులు ఉన్నారు.