Share News

kumaram bheem asifabad- పాఠశాలలను బలోపేతం చేయాలి

ABN , Publish Date - Nov 06 , 2025 | 10:36 PM

ఫ్రీ పైమరీ స్కూళ్లను సమర్థవం తంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.

kumaram bheem asifabad- పాఠశాలలను బలోపేతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఫ్రీ పైమరీ స్కూళ్లను సమర్థవం తంగా నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని జల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఫ్రీ ప్రైమరీ టీచర్లకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 41 ఫ్రీ ప్రైమరీ స్కూల్స్‌ ఉన్నాయని చెప్పారు. వీటిలో విధులు నిర్వహించేందుకు వచ్చిన దరఖాస్తులలో మెరిట్‌ ఆధారంగా పారదర్శకంగా టీచర్లను ఎంపిక చేశామని అన్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్లకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. పాఠశాలలకు వచ్చే పిల్లలకు వచ్చే పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల కంటే మెరుగ్గా విద్య అందుతుందనే నమ్మకాన్ని టీచర్లు కల్పించాలని తెలిపారు. ప్రతి ఫ్రీప్రైమరీ స్కూల్‌లో చేరే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఇతర పరికరాలను నెల రోజుల లోపు అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్‌లో పిల్లలను ఆకర్షించేందుకు వీలుగా పేయింటింగ్స్‌ వేయడం జరుగుతుందన్నారు. అవసరమైన ఫర్నిచర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబరు చివరి వరకు పూర్తి ఏర్పాట్లు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు బ్రెయిన్‌ డెవలప్‌మెంట్‌ అధికంగా ఉంటుందని చెప్పారు. చిన్నతనంలో పిల్లలకు చక్కగా ప్రేమ, అప్యాయతలతో బోధించాల్సి ఉంటుందని తెలిపారు. పిల్లలకు సిలబస్‌ సంబంధిత అంశాలతో పాటు మంచి విలువలు నేర్పాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఓపిక, ఉత్సాహం టీచర్లు భవిష్యత్‌లో కూడా కొనసాగించాల న్నారు. మన జిల్లా పదో తరగతి ఫలితాల్లో వెనకబడుతుందని అన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి విద్యార్థులకు కనీస అభ్యసన సామర్థ్యాలు పిల్లలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. ఇక్కడ వచ్చే ఫలితాల ఆధారంగా వాటిని మన జిల్లాలో కూడా విస్తరించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): రైతులు పత్తి పంటను సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు దర పొందాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం బూర్గుడ గ్రామ శివారులోని ఆర్‌ఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అధికారులతో కలిసి గురువారం జిల్లాలోని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. రైతుల వద్ద నుంచి మద్దతు ధర చెల్లించి పంట కొనుగోలు చేయనున్నామని తెలిపారు. రైతులు తాము పండించిన పత్తి పంటను దళారులకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి నష్ట పోకూడదని తెలిపారు. ప్రతి రైతు కపాస్‌ కిసాన యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. తమ వివరాలు నమోదు చేసుకోవాలని, ఆదిశగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 3.30 లక్షల ఎకరాల పత్తి పంట సాగు చేశారని, సుమారు 38 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో సీసీఐ ఆధ్వ ర్యంలో 24 జిన్నింగ్‌ మిల్లులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర అందిస్తుందని, జిన్నింగ్‌ మిల్లు నిర్వాహకుల పత్తి తీసుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, నీడ మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం చెల్లిస్తున్న మద్దతు ధర, తేమ శాతం అంశాలపై ప్రజలందరికి తెలిసే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆశ్వక్‌ అహ్మద్‌, వ్యవసాయాధికారి మిలింద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2025 | 10:36 PM