kumaram bheem asifabad- పాఠశాలలు పునఃప్రారంభం
ABN , Publish Date - Jun 12 , 2025 | 10:25 PM
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలవుల అనంతరం విద్యారు ్థలు పాఠశాలలకు చేరుకోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫూల బొకేలతో ఆహ్వానిస్తూ పాఠశాలలోపల స్వాగతం పలికారు.
వాంకిడి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సెలవుల అనంతరం విద్యారు ్థలు పాఠశాలలకు చేరుకోవడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఫూల బొకేలతో ఆహ్వానిస్తూ పాఠశాలలోపల స్వాగతం పలికారు. పాఠశాలలు పనర్ ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు సకాలంలో పాఠశాలకు రావాలని వాంకిడి ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నటరాజ్ కోరారు.
సిర్పూరు(టి), (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) మండలంలో గురువారం పాఠశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు.. పాఠశాలలు పునఃప్రారంభం కావటంతో పరిసరాల పరిశుభ్రతను కూడా ముందస్తుగా చేయించారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించేట్టు తల్లితండ్రులు బాధ్యత తీసుకోవాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సూచించారు.
జైనూర్,(ఆంధ్రజ్యోతి): స్థానిక బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో విద్యార్థుల కు గురువారం మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొడప మోతుబాయి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతీబాయి, ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ సమాఖ్య అధ్యక్షురాలు కొడప మోతుబాయి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ వసతి గృహల్లో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలను అందజేస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు.
లింగాపూర్, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మొత్తం 47 పాఠశాలలు గురువారం ప్రారం భమయ్యాయని మండల విద్యాధికారి యం శ్రీనివాస్ అన్నారు. మొదటి రోజే విద్యా ర్థుల కు పాఠ్యపుస్తలు అందజేశామని తెలిపారు. 60శాతం పాఠశాలల్లో ఏకరూ దుస్తులు అందజేశామని తెలిపారు. ఎంఈవో వెంట సీఆర్‌పీ సంజీవ్ ఉన్నారు.