School Negligence: విద్యార్థి మృతి ఘటనలో కేసు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:24 AM
హనుమకొండలోని ప్రైవేటు పాఠశాలలో గురువారం పోలేపల్లి జయంత్(15) అనే పదో తరగతి విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు...
పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణం
విద్యార్థి తండ్రి ఫిర్యాదు.. పోలీసుల విచారణ
హనుమకొండ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): హనుమకొండలోని ప్రైవేటు పాఠశాలలో గురువారం పోలేపల్లి జయంత్(15) అనే పదో తరగతి విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జయంత్ తండ్రి, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అయిన పోలెపల్లి రవి.. తన కుమారుడికి తక్షణం వైద్యసాయం అందించడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చేసినందు వల్లనే మృతి చెందాడని పేర్కొంటూ హనుమకొండ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రవి మీడియాతో మాట్లాడుతూ.. తాను దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నానని, తన కుమారుడు ఆకస్మాత్తుగా పడిపోయాడని ఫోన్ చేసి చెప్పారన్నారు. ఆ తర్వాత గంట సేపటికిగానీ ఆస్పత్రికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తన కుమారుడు బతికేవాడని విలపించారు.