kumaram bheem asifabad- ఉపకార వేతనం.. చదువుకు సహకారం
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:18 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఐదు నుంచి పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫ్రీ ఉపకార వేతనాలు(ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్) ప్రభుత్వం అందజేస్తోంది. 2025-26 సంత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
వాంకిడి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఐదు నుంచి పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫ్రీ ఉపకార వేతనాలు(ప్రిమెట్రిక్ స్కాలర్‌షిప్) ప్రభుత్వం అందజేస్తోంది. 2025-26 సంత్సరానికి సంబంధించి అర్హులైన విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చాలా మందికి అవగాహన లేక దరఖాస్తు చేసుకోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు, సంక్షేమశాఖల అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులకు బ్యాంకు ఖాతా నంబర్ ఆధార్‌కార్డుకు లింకై ఉండాలి. మొదట బ్యాంకుకు వెళ్లి సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాజీవ్ విద్యా దీవెన కింద ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సైతం ఉపకార వేతనాలు వర్తింపుచేస్తున్నారు.
- అర్హులు వీరే..
ప్రభుత్వ, పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అర్హులు. 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల కుంటుంబ ఆదాయం రూ. 1.50లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో చదివే విద్యార్థుల కుటుంబ ఆదాయం రూ. 2లక్షలు మించరాదు. కుల, ఆదాయ ధ్రవపత్రాలతో పాటు బోనాఫైడ్, విద్యార్థి ప్రగతి పత్రం, విద్యార్థి బ్యాంకు ఖాతానెంబరు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు తప్పనిసరి. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఐదు ఉంచి ఎనిమిదో తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ బాలురకు రూ. 1000, బాలికలకు రూ. 1500, వస గృహంలోని ఎస్టీ విద్యార్థులకు రూ. 1000 ఇస్తారు. 9,10 తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 3500, బీసీ విద్యార్థులకు రూ. 4 వేలు ఇస్తారు. ప్రైవేట్ పాఠశాలల్లోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 3,500 వస్తాయి.
సద్వినియోగం చేసుకోవాలి
- ఎంఈవో, శివచరణ్‌కుమార్
ఉపకార వేతనాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలల ప్రధానో పాఽధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు ఈ నెల 31 లోపు మీ-సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.