స్కానింగ్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:38 PM
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయా లని జిల్లా అడ్వైజరి కమీటీ చైర్‌పర్సన్, డీఎంహెచ్‌వో అనిత పేర్కొ న్నారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో సాంకేతిక వైద్య నిపుణులు, సిబ్బంది స్కానింగ్ చేసిన వివరాలను నిర్ణీత నమూనాలో తప్పనిసరిగా నమోదు చేయా లని జిల్లా అడ్వైజరి కమీటీ చైర్‌పర్సన్, డీఎంహెచ్‌వో అనిత పేర్కొ న్నారు. శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో పీసీపీ ఎన్ డీటీ యాక్ట్ ప్రకారం 53 స్కానింగ్ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ఇం దులో 4 ప్రభుత్వ పరంగా 49 ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు ఉన్నా యన్నారు. ప్రతి స్కానింగ్‌కేంద్రంలో స్కానింగ్ పరికరం నిర్వహి స్తు న్న వైద్యుల వివరాలు నమోదై ఉండాలని, అదే విధంగా ప్రతి కేం ద్రంలో లింగనిర్ధారణపై తీసుకుంటున్న చర్యల వివరాలు, ఫ్లెక్సీ, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. లింగ నిర్దారణ చేయము, చెప్ప ము అనే వివరాలను ప్రదర్శించాలన్నారు. బర్త్ రూట్ ఆసుపత్రికి సం బంధించిన స్కానింగ్ మిషన్‌ను అప్లోడ్ చేశామని తెలిపారు. అనం తరం స్కానింగ్‌కు సంబంధించి సూచనల పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ అరుణశ్రీ, జిల్లాపౌర సంబంఽధాల అధికారి కృష్ణమూర్తి, డాక్టర్‌లు చందు, రాజ్‌కిరణ్, గైనాకాలజిస్టు శ్రీదే వి, డీపీవో ప్రశాంతి, సీహెచ్‌వోలు వెంకటేశ్వర్లు, దిశ సమన్వయకర్త రమేష్, సుమన్, సీనియర్ అసిస్టెంట్ హారిక, డీపీహెచ్‌ఎన్ పద్మ, వ సుమతి, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.