Share News

kumaram bheem asifabad- సత్యసాయి బోధనలు అనుసరించాలి

ABN , Publish Date - Nov 23 , 2025 | 10:27 PM

సత్యసాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

kumaram bheem asifabad- సత్యసాయి బోధనలు అనుసరించాలి
ఆసిఫాబాద్‌ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్న సత్యసాయిబాబా సేవా సదన్‌ సభ్యులు

ఆసిఫాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో ఆదివారం సత్యసాయిబాబా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు బాబా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ సత్యసాయిబాబ చూపిన సేవ, ధర్మ మార్గం ఎళ్లవేళలా అనుసరణీయమం అన్నారు. మానవసేవే పరమావధిగా సేవా కార్యక్రమాలు చేపట్టి విశిష్ట స్థానం సంపాదించారని అన్నారు. ప్రేమ, అధ్యాత్మిక బోధనలతో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది భక్తుల హృదల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. కార్యక్రమంలో పౌర సంబంధాల అధికారి సంపత్‌కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని గుండి రోడ్డులో గల సత్యసాయి సేవా సదనలో భక్తిశ్రద్ధలతో సత్యసాయి శత జయంత్యుత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం, సాయంత్రం దీపాలంకరణ, కేక్‌ కట్‌ చేశారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలను పురస్కరించు కుని రెబ్బెన మండలం గోలేటిలో ఆదివారం దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సత్యసాయిబాబా మేనేజ్‌మెంట్‌ సత్యనారాయణ, ఎస్వీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సంజీవ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): దహెగాం మండలం బీబ్రా గ్రామంలో ఆదివారం సత్యసాయిబాబా జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నగర సంగకీర్తన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాబాసాగర్‌ గ్రామంలో ఆదివారం శ్రీ భగవాన్‌ సత్యసాయిబాబా జయంతిని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, పల్లకీ సేవ, భజన, మంగళహారతి నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 23 , 2025 | 10:27 PM