Sarvai Papanna Jayanthi: పోరాటయోధుడు సర్వాయి పాపన్నగౌడ్
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:34 AM
దల కోసం పోరాడి అమరుడైన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
భవిష్యత్ తరాలకు స్ఫూర్తి పాపన్న: కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పేదల కోసం పోరాడి అమరుడైన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. పెత్తందారీ వ్యవస్థను ధైర్యంగా ఎదిరించి నిలబడ్డారని కొనియాడారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేశామని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందని వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత జనం, బహుజనుల ఆత్మగౌరవం కోసం సర్వస్వాన్ని ధారబోసిన మహాయోధుడు సర్వాయి పాపన్న అని మాజీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. పాపన్న పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, దాసోజు శ్రవణ్ మాట్లాడారు. సర్వాయి పాపన్న ఆశయాలను నిలబెట్టుకోవాలంటే బహుజన వర్గాలకు జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా సమన్వయంతో పోరాడాలన్నారు.