సర్పంచులు గ్రామాభివృద్ధికి బాటలు వేయాలి
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:01 PM
నూతన పాలకవర్గంతో కలిసి సర్పంచులు కష్టపడి పనిచేసి గ్రామాభిృద్ధికి బాటలు వేయాలని జిల్లా ట్రైనీ అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ మహ్మద్ విలాయత్ ఆలీ అన్నారు.
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వలాయత్ అలీ
దండేపల్లి డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): నూతన పాలకవర్గంతో కలిసి సర్పంచులు కష్టపడి పనిచేసి గ్రామాభిృద్ధికి బాటలు వేయాలని జిల్లా ట్రైనీ అసిస్టెంట్ డిప్యూటీ కలెక్టర్ మహ్మద్ విలాయత్ ఆలీ అన్నారు. బుధవారం దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శ్రీల క్ష్మి మండల సమైఖ్య ఆఽధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల మ హిళ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను డీఆర్డీడీవో కిషన్‌తో కలిసి చిరు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామాలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల దరికి చేరే విధంగా పాటుపడా లన్నారు. ప్రభుత్వం మహిళలు అన్నిరంగాల్లో రాణించే విధంగా అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. మహిళలు స్వయంకృషితో ఆర్థికం గా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. అనంతరం మండలంలో మహిళ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించారు. కా ర్యక్రమంలో డీపీఎం సారయ్య, మాజీ జడ్పీటీసీ గడ్డం నాగరాణి, జి ల్లా సమైఖ్య అధ్యక్షురాలు అనిత, ఏపీఎం లక్ష్మి, ఎంపీవో విజయ ప్రసా ద్, సీసీలు లావణ్య, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.