Share News

kumaram bheem asifabad-సర్పంచ్‌లు ఇవి తెలుసుకోవాలి..

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:22 PM

పంచాయతీ ఎన్నికలు ముగిసి ఈనెల 22న కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. కానీ గ్రామాలను ప్రగతిపథంలో నడపాలంటే వీరికి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. గ్రామాల్లో చేపట్టే పనులేవైనా ముందుగా సమావేశాల్లో ఆమోదం పొందాలి. కేవలం సమావేశమేనని తేలికగా తీసిపాసేందుకు వీల్లేదు.

kumaram bheem asifabad-సర్పంచ్‌లు ఇవి తెలుసుకోవాలి..
లోగో

- ఎజెండాతో ముందుకు సాగితేనే పల్లెల్లో ప్రగతి

వాంకిడి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ముగిసి ఈనెల 22న కొత్త పాలకవర్గాలు కొలువు దీరాయి. కానీ గ్రామాలను ప్రగతిపథంలో నడపాలంటే వీరికి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. గ్రామాల్లో చేపట్టే పనులేవైనా ముందుగా సమావేశాల్లో ఆమోదం పొందాలి. కేవలం సమావేశమేనని తేలికగా తీసిపాసేందుకు వీల్లేదు. పంచాయ తీరాజ్‌ చట్టం ప్రకారం వీటి పాత్ర ప్రధానమైంది. తీసుకునే నిర్ణయా, ఏకాభిప్రాలకు చట్టబద్ధత అవసరముందని గుర్తు పెట్టుకోవాలి. అందువల్ల వీటిపై అవగాహన ఎంతో ముఖ్యం.

- సాధారణ సమావేశాలు..

ప్రతీ పంచాయతీ పరిధిలో నెలకోసారి సాధారణ సమావేశం నిర్వహించాలి. కనీసం మూడు రోజుల ముందు ఈ విషయం వార్డు సభ్యులకు తెలియపర్చాలి. అందులోని అంశాలపై అవగాహన పెంచుకోని సమావేశంలో అభ్యంతరాలు తేవనెత్తడం, సందేహాలు నివృత్తి చేసుకోవడం, ఎజెండాను ఆమోదించడం చేయాలి. మొత్తం సభ్యుల్లో విధిగా మూడోవంతు హాజరు కావాల్సి ఉంటుంది. లేకపోతే సమావేశం వాయిదా పడుతుంది. సమావేశంలో గ్రామాభివృద్దికి సంబంధించిన తీర్మాణం చేస్తారు.

- అత్యవసర సమావేశాలు..

కేవలం ఒకవ్యవధిలోనే ఎజెండా నోటీసులు అందించి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. సాధారణ ఎజెండాలోని అంశాలు కాకుండా అత్యవసరంగా ప్రత్యేకమైన అంశాలను మాత్రమే ఇందులో పొందుపరుస్తారు. మూడో వంతు సభ్యులు దీనిలో కూడా తప్పని సరిగా ఉండాల్సిందే. బడ్జెట్‌ ఆమోదం, గత తీర్మాణాల రద్దు, అవిశ్వాస తీర్మాణం వంటి కీలక అంశాలున్న సమయంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించ ఆస్కారంఉంది. పాలకవర్గ సభ్యుల అఽభ్యర్థన మెరకు నిర్వహించే సమావేశాల్లో ముఖ్యమైన అంశాలు పాలకవర్గాలు గుర్తపెట్టుకోవాలి. మూడో వంతు సభ్యుల హాజరు తప్పనిసరిగా ఉండాలి. సమావేశం నిర్వహించే తేదీ, కారణాలు తెలియచేస్తు వముందు సమాచారం అందించాలి. సభ్యుల అభిప్రాయాలు, స్థానిక సమస్యలు అధికారికంగా చర్చకు తీసుకురావాలి. పంచా యతీలకు వివిధ మార్గాల్లో వచ్చే నిధులు, ఆదాయ వనరులు, ఖర్చులు, నిన్వహణ, తదితరఅనేకఅంశాలను తెలుసుకొని ఓ అవగాహన పెంచుకోగలిగితే అందుబాటులోని నిధులను గ్రామ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. దీనికోసం సభ్యులు సమావేశాల్లో చర్చించి తీర్మానాలు చేసుకోవచ్చు. సమయానుకూల చర్చలతో సత్ఫలితాలు పొందవచ్చు.

Updated Date - Dec 29 , 2025 | 11:22 PM