సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా పని చేయాలి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:03 PM
గ్రామాభివృద్ధి లో సర్పంచ్‌లదే కీలక బాధ్యతని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు.
- ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాభివృద్ధి లో సర్పంచ్‌లదే కీలక బాధ్యతని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అ న్నారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గె లిచిన సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ను ఆయన శాలువాలు కప్పి సన్మానించారు. ఆయన మాట్లాడు తూ సర్పంచ్‌లు, అధికారులతో క లిసి సమన్వయంతో పనిచేయాలని సూచించా రు. సర్పంచ్‌లు గ్రామప్రజలకు నిరంతరం అం దుబాటులో ఉంటూ ప్రజాసమస్యలు పరిష్క రించడంలో ముందుండాలన్నారు. కార్యక్రమం లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, పాలశీతలీకరణ కేంద్ర చైర్మన్ నర్సయ్య యాద య్, గోపాల్‌రెడ్డి, అనంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, రామనాధం,
సెమీ క్రిస్మస్ వేడుకల్లో ...
సర్వమతాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పట్టణంలోని ఓ ఫం క్షన్ హాల్‌లో నిర్వహించగా, ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్‌చేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రిస్టియన్ కార్పొరేషన్, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతీఏటా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుం దని ఆయన అన్నారు. ఎంపీ మల్లు రవి సతీమ ణి క్రిస్మస్ బహుమతి పంపారని తెలిపారు.
మన్ననూరు సర్పంచుకు అభినందన
మన్ననూర్, (ఆంధ్రజ్యోతి) : మన్ననూరు సర్పంచుగా గెలుపొందిన మంజులను ఎమ్మెల్యే వంశీకృష్ణ అభినందించారు. అచ్చంపేట ప్రజా భవన్‌లో మన్ననూరు సర్పంచి మంజుల ఆధ్వ ర్యంలో ఉపసర్పంచ్ రమణయ్యగౌడ్‌లతో పాటు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేను శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో వారు సన్మానించారు. కాంగ్రెస్ నాయకులు రాజారాం నాయక్, నీల కుమార, శివాజీ, కృష్ణ గోపాల్ పాల్గొన్నారు.