kumaram bheem asifabad- పొదుపు మహిళలకు చీరలు
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:14 PM
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగ సందరర్భంగా ఇందిరమ్మ చీరలను ఉచితంగా అందించాలని నిర్ణయిం చింది. గతంలో బతుకమ్మ చీరల పేరుతో అం దించిన ఈ పథకాన్ని ఈసారి ఇందిరమ్మ చీరల పేరుతో అమలు చేస్తున్నారు. పొదుపు సంఘాల లోని సభ్యులకు రెండు చీరలను అందజేస్తారు.
- బతుకమ్మ పండుగకు ఒక్కొక్కరికి రెండు అందజేయాలని నిర్ణయం
- జిల్లాలో 1,02,992 మంది సభ్యులు
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగ సందరర్భంగా ఇందిరమ్మ చీరలను ఉచితంగా అందించాలని నిర్ణయిం చింది. గతంలో బతుకమ్మ చీరల పేరుతో అం దించిన ఈ పథకాన్ని ఈసారి ఇందిరమ్మ చీరల పేరుతో అమలు చేస్తున్నారు. పొదుపు సంఘాల లోని సభ్యులకు రెండు చీరలను అందజేస్తారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి): స్వయం సహాయక సంఘాల మహి ళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ బతుక మ్మ పండుగకు ‘ఆక్కాచెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరిట చీరలను అందించనుంది. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల వివరాలను అధికారులు సేకరించారు. వారం రోజు ల్లోగా జిల్లాకు చీరలు రానున్నాయి. ఒ క్కొక్కరికి రెండు చీరల చొప్పున అందజేయను న్నారు.
- గతంలో డీలర్ల ద్వారా..
గత ప్రభుత్వం రేషన్‌కార్డులో పేరున్న ప్రతి మహిళకు డీలర్ల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. ఈ పథకంలో అందించిన చీరలు నాణ్యతగా లేవని మహిళలు వీటిని దరించడం లేదని బావించి కాంగ్రెస్ ప్రభుత్వం గత బతుకమ్మ పండుగకు చీరల పంపిణీని నిలిపి వేసింది. దీంతో కొంత వ్యతిరేకత వస్తుందని బావించి తిరిగి ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఇందు లో బాగంగా స్వయం సహాయక సంఘాల మహి ళలకు చీరలు అందించడం ద్వారా చేనేత కార్మికు లకు ఉపాధి అవకాశాలు కల్పిండమే ప్రధాన ఉద్దేశంతో ఈ పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తున్నా రు. ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి విడత ఒక్కొ చీర మాత్ర మే ఇవ్వనున్నారు. దీని కోసం మొదటి విడత వారం రోజుల్లో 1,02,992 చీరలు రానున్నాయి. వీటిని భద్రపరిచే బాధ్యతలను గ్రామీణాభివృద్ధి సంస్థకు అప్పగించారు. వీటిని ఉంచడానికి జిల్లా లోని కౌటాల, రాంపూర్, జైనూరు మండలాల్లో గో దాంలను ఎంపిక చేశారు. ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయికి తరలించనున్నారు.
- 8,897 స్వయం సహాయక సంఘాలు
జిల్లాలో 8,897 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఇందులో 1,02,992 మంది సభ్యులు న్నారు. ఈ స్వయం సహాయక సంఘాల్లో 18 ఏళ్లు నిండిన వారికే అవకాశం ఉంది. వీరంత ప్రభుత్వం అందించే రుణాలను పొంది ప్రతినెలా క్రమం తప్పకుండా చెల్లిస్తు ఉంటారు. ప్రస్తుం ప్రభుత్వం అందించనున్న చీరలు చేనేతవి కావడమే కాకుండా చాలా మన్నికగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఒ క్కొక్క చీర సుమారు రూ. 800కు లభ్యమయ్యే వాటిని మహిళలకు పంపిణీ చేయాలని భావిస్తు న్నారు.
- ఉన్నతాధికారులకు నివేదిక..
కాగజ్‌నగర్ టౌన్: జిల్లాలో సంఘాలు వాటిలో సభ్యుల సంఖ్య ఎంత.. ఏయే ప్రాంతాలకు సరఫరా చేయాలనే వివరాలను ఉన్నతాధికారులకు జిల్లాలోని మెప్మా, సెర్ప్ సిబ్బంది సేకరించి నివేదిక లు అందజేశాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 900 గ్రూపులుండగా ఒక్కో గ్రూపులో 10 మంది చొప్పున మొత్తం 9,000 మందికి, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 270 గ్రూపులకు గానూ 2,700 మంది సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ . గత ప్రభుత్వం దసరాకు, బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దసరాకు ముందే బతు కమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పొదుపు మహిళలకు చీరలు అందించాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపి, మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బందికి బాధ్యతలు అప్పగించనున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ..
- దత్తరావు, డీఆర్‌డీవో
దసరా నాటికి స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల్లోగా జిల్లాకు చీరలు రానున్నాయి. వీటిని భద్ర పరిచేందుకు జిల్లాలో మూడు ప్రాంతాలలో గోదాంలను గుర్తించాం. ప్ర భుత్వ ఆదేశాల మేరకు చీరలను పంపిణీ చేస్తాం.