Share News

kumaram bheem asifabad- మహిళలందరికీ చీరలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:13 PM

జిల్లాలోని మహిళలందరికీ చర్యలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

kumaram bheem asifabad- మహిళలందరికీ చీరలు
ఆసిఫాబాద్‌లో చీరలు పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మహిళలందరికీ చర్యలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి దత్తారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మహిళకు చీర అందించే లక్ష్యంతో 1.11 లక్షల చీరలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో చీరల పంపణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. మహిళా శక్తి ఎంతో గొప్పదని కొనియాడారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ స్వయం సహయక సంఘాల సభ్యులు రుణాలు తిరిగి చెల్లింపులు ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లాలో 98 శాతం తిరిగి చెల్లింపు జరగడమే దీనికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు వృధా చేయకుండా ఉపయోగించుకోవాలన్నారు. స్వయం సహయక సంఘాలలో 16 నుంచి 18 సంవత్సరాల కిశోర బాలికలను కూడా చేర్చుకోవడానకిఇ తీసుకున్న నిర్ణయం హర్షిందగ్గదన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల, శ్రీదేవి, డీపీఎం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని ఒక రోజుతో పూర్తిగా తెలుసుకోలేమని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్‌ మేరీ ఉననత పాఠశాలలో జల్లా ఇన్‌చార్జి డీఈఓ దీపక్‌ తివారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 53వ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్‌పేర్‌ మనాక్‌కు చైర్మన్‌ హోదాలో ముఖ్య అతిథిగా హాజరై సీవీ రామన చిత్రపటానికి ఊల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్రం అనేది ఒక రోజుతో అర్థమయ్యేది కాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో అపజయం అనేది వస్తుందని దాని నుంచి పాఠాలు నేర్చుకుని చేసిన తప్పులను సరిదిద్దుకొన విజయం వైపు నడవాలన్నారు. ఐన్స దీనిని ఎప్పుడు నేర్పుతుందని చరిత్రలో ఎంతో మంది శాస్త్రజ్ఞులు తమ ప్రయోగాలలో ఒకే సారి విజయవంతమైన వారు ఎవరు లేరన్నారు. జిల్లా వ్యాప్తంగా 300 ప్రదర్శనలు రెండు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దేవాజీ, మధుకర్‌, శ్రీదేవి, రాందాస్‌, ప్రభాకర్‌, హనుమంతు, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2025 | 11:13 PM