వైభవంగా సంకట హర చతుర్థి పూజలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:58 PM
నస్పూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లోని లక్ష్మి గణపతి దేవాలయంలో సంకట హర చతుర్థిని పురస్కరించుకుని శనివారం స్వామి వారికి మహా భస్మాభిషేకం వైభవో పే తంగా నిర్వహించారు. సంకట హర చతుర్థి సందర్భంగా ఉదయం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని 108 ప్రదక్షిణలు చేశారు.
నస్పూర్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లోని లక్ష్మి గణపతి దేవాలయంలో సంకట హర చతుర్థిని పురస్కరించుకుని శనివారం స్వామి వారికి మహా భస్మాభిషేకం వైభవో పే తంగా నిర్వహించారు. సంకట హర చతుర్థి సందర్భంగా ఉదయం భక్తులు ఆలయానికి పెద్ద ఎత్తున చేరుకుని 108 ప్రదక్షిణలు చేశారు. ప్రధానార్చ కులు వంశీ కృష్ణ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు జరిగా యి. సాయంత్రం స్వామి వారికి విశేష మహా భస్మాభిషేకం కన్నుల పండు గగా నిర్వహించారు. పురవీధుల్లో స్వామి వారికి పల్లకీ సేవ జరిగింది. చు ట్టు పక ్కల ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారిని దర్శించి తీర్థ ప్ర సాదాలను స్వీకరించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావు తెలిపారు. చంద్రోదయం అనంత రం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు.