పారిశుధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
ABN , Publish Date - Jun 10 , 2025 | 11:50 PM
గత నస్పూర్ మున్సిపాలిటిలో పని చేసిన పారిశుధ్య కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరుతూ నస్పూర్ పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.
మంచిర్యాలకలెక్టరేట్, జూన్10 (ఆంధ్రజ్యోతి): గత నస్పూర్ మున్సిపాలిటిలో పని చేసిన పారిశుధ్య కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని కోరుతూ నస్పూర్ పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత నస్పూర్ మున్సిపాలిటిలో పనిచేసి న 120 మందిని తీసివేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీ సుకోవాలన్నారు ఓవర్‌హెడ్ మంచినీటి ట్యాంక్‌లు బ్లీచింగ్ పౌ డర్‌తో శుభ్రం చేయాలన్నారు. అమృత్ వాటర్ ట్యాంక్ నిర్మాణా ల కోసం తవ్విన గుంతల దగ్గర ఎలాంటి రక్షణ చర్యలు లేవని వాటిని వెంటనే నిర్మించాలన్నారు. గత నస్పూర్ మున్సిపాలిటి లో డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా వార్డు పరిధిలో దాదాపుగా రెం డు ట్రాలీలు, మొత్తం 41 ట్రాలీలు నస్పూర్ మున్సిపాలిటిలో పెట్టడం జరిగిందన్నారు. అందులో ఉన్న ట్రాలీలు నిరుపయో గంగా ఉన్నాయని వాటిని రిపేర్ చేయాలన్నారు. డ్రైవర్లను కూ డా వెంటనే విదుల్లోకి తీసుకోవాలన్నారు. నస్పూర్ మున్సిపాలి టి పరిధిలో ఎల్‌ఈడీ లైట్స్ చాలా పని చేయడం లేదన్నారు. వెంటనే వాటిని రిపేర్ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మా ణ ఎంపికలో అవకతవకలు జరిగాయని, అర్హులైన పేదవారికి అందే విధంగా చూడాలన్నారు. మిషన్ అమృత్ పథకం కింద వాటర్ ట్యాంక్‌లు కట్టే ప్రక్రియలో పెద్ద ఎత్తున మట్టి తీయడం జరిగిందని, ఒక వేళ వర్షాలు చిన్ని పిల్లలు అందులో పడే అవ కాశాలు ఉన్నాయని ముందు జాగ్రత్తగా కంచే ఏర్పాటు చేయాలని కోరారు.