పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:17 PM
గ్రామాల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
డీపీవో వెంకటేశ్వర్‌రావు
జైపూర్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. అందుబాటులో ఉన్న పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మల్టీ పర్పసర్ వర్కర్లను వార్డుల వారీగా విభజించి తడి, పొడి చెత్తను సేకరించాలన్నారు. గ్రామాల్లోని వీధుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు లే కుండా చూడాలని, సెగ్రిగేషన్‌షెడ్డులో వర్మీ కంపోస్టు తయారు చేయాల న్నారు. ఇంటి పన్నుల వసూళ్లలో మండలం 29 శాతం ఉన్నందున ఈ నె ల 25లోగా వంద శాతం పన్నులను వసూలు చేయాలని లేకుంటే తగు చర్యలుతీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీపతి బాపురావు , కార్యదర్శులు పాల్గొన్నారు.