పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:25 PM
గ్రామా లను స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుధ్య కార్య క్రమాలను నిరంతరం కొనసాగించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నా రు. ఆయన మండలంలోని ఘన్‌పూర్, గొళ్లప ల్లి, మైలారం గ్రామాలను గురువారం సంద ర్శించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ప రిశీలించారు.
-జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు
నెన్నెల, జులై 17 (ఆంధ్రజ్యోతి) : గ్రామా లను స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుధ్య కార్య క్రమాలను నిరంతరం కొనసాగించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు అన్నా రు. ఆయన మండలంలోని ఘన్‌పూర్, గొళ్లప ల్లి, మైలారం గ్రామాలను గురువారం సంద ర్శించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ప రిశీలించారు. ఈ సంధర్భంగా డీపీవో మాట్లా డుతూ పరిసరాల పరిశుభ్రత లోపిస్తే సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంద న్నారు. మురికి కాలువలు, రోడ్లను ఎప్పటిక ప్పుడు శుభ్రం చేయాలన్నారు. రోడ్ల పక్కన పి చ్చిమొక్కలు, చెత్త లేకుండా జాగ్రత్త పడాల న్నారు. పల్లెల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తీసుకెళ్లి తడి చెత్తను సేంద్రీయ ఎరువుగా మా ర్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రిసైక్లింగ్ యూనిట్‌కు తర లించాలన్నారు. జీపీ కార్యాలయాల్లో రికార్డు లు పరిశీలించి, నిధుల వ్యయం గూర్చి వాకా బు చేశారు. రికార్డులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలన్నారు. హెల్త్‌సబ్ సెంటర్‌ను సందర్శిం చి సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక పా ఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శులు పద్మ నాభం, వనిత, సాయితేజ ఉన్నారు.