Share News

పారిశుధ్యం అస్తవ్యస్తం...

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:06 PM

మంచిర్యా ల జిల్లా కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అంతర్గత రోడ్డు, డ్రైనేజీలు నెలల తరబడి శుభ్రపరిచిన దాఖలాలు కానరావడంలేదు. ఫిర్యాదులు వస్తే తప్ప....మున్సిపల్‌ అధికారులు స్పందించడంలేదనే ఆరో పణలు ఇక్కడ నిత్యం వినిపిస్తూ ఉంటాయి.

పారిశుధ్యం అస్తవ్యస్తం...

-జిల్లా కేంద్రంలో మురుగుతో నిండిన డ్రైనేజీలు

-రోజుల తరబడి శుభ్రతకు నోచుకోని నాళాలు

-పాలక వర్గాలు లేకపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు

-ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించని అధికారులు

-దయనీయంగా అంతర్గత రోడ్ల దుస్థితి

మంచిర్యాల, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మంచిర్యా ల జిల్లా కేంద్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అంతర్గత రోడ్డు, డ్రైనేజీలు నెలల తరబడి శుభ్రపరిచిన దాఖలాలు కానరావడంలేదు. ఫిర్యాదులు వస్తే తప్ప....మున్సిపల్‌ అధికారులు స్పందించడంలేదనే ఆరో పణలు ఇక్కడ నిత్యం వినిపిస్తూ ఉంటాయి. మంచిర్యాల నగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారినప్పటికీ పా రిశుధ్యం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. నగరంలో ఎక్కడ చూసినా డ్రై నేజీలు పూడుకుపోయి దర్శనమిస్తున్నాయి. వీధుల్లో డ్రై నేజీల నుంచి దుర్గంధం వ్యాపిస్తున్నా పట్టించుకోవ డం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో సామాన్య ప్ర జలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శివారు ప్రాంతాల్లో అధ్వానం...

పట్టణ శివారు ప్రాంతాల్లో అయితే ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. నెలల తరబడి అక్కడి డ్రైనేజీలు శుభ్రపరిచిన దాఖలాలు లేవు. నెలలో ఒకటి రెండు సార్లు మాత్రమే నాలాలను శుభ్రం చేస్తారని శి వారు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలం లో వరద నీటితో నాలాలు ప్రత్యేకంగా శుభ్రం చేయా ల్సిన అవసరం లేకుండా ఉండేది. ప్రస్తుతం వర్షాలు త గ్గి, డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నగర శివారు ప్రాంతాలైన విలీన గ్రామాలతోపాటు రాజీవ్‌నగర్‌, తిలక్‌నగర్‌, అం డాళమ్మ కాలనీల్లో డ్రైనేజీల్లో మురుగు పూడుకుపో యి నట్లు ఆయా ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు.

పాలక వర్గాలు లేకపోవడంతో...

మున్సిపల్‌ పాలక వర్గాల పదవీ కాలం ముగిసి సు మారు సంవత్సరం కావస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు జరిగితేగానీ కొత్త పాలక వర్గాలు కొలువుదీరే అవకాశం లేదు. మంచిర్యాల నగరం కార్పొరేషన్‌గా మారినందున ఎన్నికలు మరింతగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో సంవత్సరం పాటు పాలక వర్గాలు ప్రజ లకు అందుబాటులో లేకుండా పోయాయి. మున్సిపల్‌ కౌన్సిలర్లు పదవుల్లో ఉన్నప్పుడు ప్రజల నుంచి చీవాట్లు తినాల్సి వస్తుందన్న భయంతోనైనా వార్డుల్లో పారిశుఽ ద్యం, పరిశుభ్రత పనులు చేయించేవారు. ప్రజలకు కౌ న్సిలర్లు జవాబుదారీగా ఉండేవారు. ప్రస్తుతం పాలక వర్గాలు లేని కారణంగా ప్రజల సమస్యలు చెప్పుకొనేం దుకు అవకాశం లేకుండా పోయింది. చిన్న చిన్న సమ స్యలకు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లేందుకు సామా న్య ప్రజలు అంతగా శ్రద్ద కనబరచరు. దీంతో సమస్య లు జఠిలమై ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొ న్నాయి. మున్సిపల్‌ అధికారులు ప్రజా సమస్యలపై దృ ష్టి సారించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందనే అ భిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్గత రోడ్ల పరిస్థితీ అంతే...

కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ డివిజన్‌లలో అంతర్గ త రోడ్ల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది. నిత్యం రోడ్లను శుభ్రం చేయాల్సిన పారిశుధ్య కార్మికులు అస లు డివిజన్‌లలో కానరావడం లేదంటే అతిశయోక్తికా దు. నెలల తరబడి రోడ్లన్నీ దుమ్ముతో నిండిపోయి నా స్పందన లేకపోవడం గమనార్హం. అంతర్గత రోడ్లను శు భ్రపరిచేందుకు ప్రత్యేకంగా కార్మికులను కేటాయించా రు. వారు విధుల్లో ఉంటున్నారో...లేదో పర్యవేక్షించాల్సి న అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో పేడ, దుమ్ముతో నిండిన రోడ్ల కారణంగా ప్రజలు ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - Nov 09 , 2025 | 11:06 PM