kumaram bheem asifabad- టీజీఎండీసీ ద్వారా ఇసుక సేకరించాలి
ABN , Publish Date - Jun 17 , 2025 | 10:58 PM
జిల్లాలో ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులలో ఉపయోగించే ఇసుకను టీజీఎండీసీ (తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా సేకరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఖనిజ, గనుల శాఖ, నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక సేకరణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, జూన్ 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులలో ఉపయోగించే ఇసుకను టీజీఎండీసీ (తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ద్వారా సేకరించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఖనిజ, గనుల శాఖ, నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వం ద్వారా చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇసుక సేకరణపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టే ప్రభుత్వ అభివృద్ధి పనులు నీటి పారుదల శాఖ ప్రాజెక్టుల నిర్మాణం, భవన నిర్మాణాలు, వంతెనలు, కాలువలు, రహదారులు, సింగరేణి, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులకు ఉపయోగించే ఇసుకను తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా సేకరించాలన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అవసరమయ్యే ఇసుక కోసం ఆన్‌లైన్ ద్వారా ఇండెంట్‌లు సమర్పించాలని చెప్పారు. జీరో పర్మిట్ ద్వారా క్వారీల నుంచి మెటల్ తరలించాలని, జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మైనింగ్ ఏడీ గంగాధర్‌రావు, పీవో రవీందర్, రోడ్లు భవనాల శాఖ అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ ప్రభాకర్, నీటి పారుదల శాఖ ఈఈలు గుణవంతరావు, ప్రభాకర్, గిరిజన సంక్షేమ వాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా గుణాత్మక విద్య
ఆసిఫాబాద్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విలువలు కలిగిన గుణాత్మక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్‌లో మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల అడ్మిషన్లకు సంబంధించిన గోడ ప్రతులను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఈ ప్రాంత బాలికల కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని అన్నారు. ఈ గురుకుల కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు వసతి, భోజన తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుం టుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అనూష, అధ్యాపకులు పాల్గొన్నారు.