kumaram bheem asifabad- ఇసుక ఉచితం.. రవాణా భారం
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:13 PM
ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది. అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. కానీ ఆ ఇసుకను ఇంటికి తీసుకొచ్చేందుకు రవాణా ఛార్జీల భారం పడుతోందని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జైనూర్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోంది. అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. కానీ ఆ ఇసుకను ఇంటికి తీసుకొచ్చేందుకు రవాణా ఛార్జీల భారం పడుతోందని లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మాణా నికి అవసరమయ్యే ఇసుకు, ఇటుక, సిమెంటు ధరలు పెరుగడంతో ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు దాటుతుం దని, అదనపు భారం పడుతున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు.
- ఏజెన్సీ మండలాల్లో
జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ఇసుక సదుపాయం లేక పోవడంతో ఆసిఫాబాద్, చిర్రకుంటల క్వారీల నుంచి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక రవాణా చేసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి ఇసుకను జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), కెరమెరి, తిర్యాణి, మండలాల్లోని గ్రామాలకు తీసుకు రావడానికి లబ్ధిదారులపై రవాణా భారం పడుతోంది. ఒక్కో ఇంటికి ఎనిమిది నుంచి 10 ట్రాక్టర్ల ఇసుక ఇచ్చేందుకు అనుమ తులు ఉన్నాయి. ట్రాక్టర్ కూలీల రవాణా ఖర్చులు లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. ఆసిఫాబాద్, చిర్రకుంటల నుంచి ఈ మండలాల్లోని ఆయా గ్రామాల వరకు 70 నుంచి 90 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఒక్కొక్క ట్రాక్టర్ రవాణాకు రు. 7,500 నుంచి 9000 వరకు నగదును చెల్లించాల్సి వస్తున్నది. మొత్తం ఇసుకకే రూ. 60 వేల నుంచి 90 వేల వరకు లబ్ధిదారులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. పథకం కింద ఇసుక రవాణాకు కేవలం ట్రాక్టర్లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. పెద్ద వాహనాలకు (లారీలు) అనుమతులు ఇస్తే ఒకే సారి నాలుగు, ఐదు ట్రాక్టర్ల మేర ఇసుక ఇంటికి వచ్చే ఆవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ట్రాక్టర్లతోనే ఇసు కను తీసుకొస్తే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోయే పరిస్థితి లేదని లబ్ధిదారులు చెబు తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రవాణా భారం పడకుండా చర్యలు తీసుకోవాలని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కోరుతున్నారు.