తక్కువ ధరకే ఇసుక
ABN , Publish Date - Nov 19 , 2025 | 11:19 PM
చెన్నూరు మండలంలోని బా వురావుపేటలో ఏర్పాటు శాండ్ బజార్ ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసు క అందుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివే క్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
-శాండ్ బజార్‌ను ప్రారంభించిన మంత్రి
చెన్నూరు, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : చెన్నూరు మండలంలోని బా వురావుపేటలో ఏర్పాటు శాండ్ బజార్ ద్వారా ప్రజలకు తక్కువ ధరకే ఇసు క అందుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివే క్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం బావురావుపేటలో టీజీఎండీసీ ద్వా రా ఏర్పాటు చేసిన శాండ్ బజార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన శాండ్ బజార్ ద్వారా తక్కువ ధరకే ఇసుక అం దుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణ పను లు చేపడుతున్న ప్రజలకు ఇసుక లభ్యతను సులభతరం చేయడం, అక్రమ రవాణాను అరికట్టడం దీని ఉద్దేశ్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీ ఆర్‌ఎస్ లీడర్లు ప్రజల సొమ్మును దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అక్రమ ఇసుక దందాను అరి కట్టామన్నారు. బీఆర్‌ఎస్ సర్కారు ఖజానాను ఖాళీ చేయడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని వ మ్ము చేయకుండా మైనింగ్ శాఖ ద్వారా గత ఏడాది కంటే ఈ ఏడాది 18 శాతం అధికంగా పన్నులు వసూలు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అ న్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్‌దీపక్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.