Share News

కోర్ట్‌ కాంప్లెక్స్‌కు మోక్షం...

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:34 PM

జిల్లా కేం ద్రంలో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి ఎట్టకే లకు మోక్షం లభించింది. ’న్యాయ నిర్మాణ ప్లాన్‌’ కింద రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కోర్టు కాంప్లెక్స్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, అందులో మంచిర్యాల జిల్లా సైతం ఉంది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 10+2 ప్రాతిపదికన రూ. 81 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ నాలుగు నెలల క్రితం జీఓ 597 జారీ చేసింది.

కోర్ట్‌ కాంప్లెక్స్‌కు మోక్షం...

-భవన సముదాయానికి రేపు శంకుస్థాపన

-రూ. 81 కోట్లతో చేపట్టనున్న పనులు

-కలెక్టరేట్‌ సమీపంలో ఐదెకరాల స్థలం కేటాయింపు

-ఒకే సముదాయంలో అన్ని కోర్టుల ఏర్పాటు

మంచిర్యాల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి ఎట్టకే లకు మోక్షం లభించింది. ’న్యాయ నిర్మాణ ప్లాన్‌’ కింద రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలకు కోర్టు కాంప్లెక్స్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, అందులో మంచిర్యాల జిల్లా సైతం ఉంది. ఈ మేరకు ఒక్కో జిల్లాకు 10+2 ప్రాతిపదికన రూ. 81 కోట్లను ప్రభుత్వం మంజూరు చేస్తూ నాలుగు నెలల క్రితం జీఓ 597 జారీ చేసింది. కోర్టు కాంప్లెక్స్‌ నిర్మించడానికి టెండర్‌ పనులు సైతం ఇప్పటికే పూర్త య్యాయి. మంచిర్యాలలో వివిధ కోర్టులు ఏర్పడి సు మారు 17 ఏళ్లు గడుస్తున్నా శాశ్వత భవనాలు లేక ఇం తకాలం ఇబ్బందులు తప్పలేదు. ఉట్నూరులో ఉన్న మొబైల్‌ కోర్టును 2005 ఏప్రిల్‌ 7న జూనియర్‌ సివిల్‌ జడ్జి కం జ్యూడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మా ర్పు చేస్తూ మంచిర్యాలకు తరలించగా, క్రమంగా కో ర్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

తొమ్మిది కోర్టుల ద్వారా న్యాయ సేవలు...

ప్రస్తుతం జిల్లా కేంధ్రంలో వివిధ స్థాయిల్లోని తొమ్మి ది కోర్టుల ద్వారా ప్రజలకు న్యాయ సేవలు అందుతు న్నాయి. జిల్లా జడ్జి కోర్టుతోపాటు అదనపు జిల్లా జడ్జి కోర్టు, ఒక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, అడిషనల్‌ సీని యర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, మూడు జూనియర్‌ సివిల్‌ జ డ్జి కోర్టులు, పోక్సో కోర్టు, జువైనల్‌ జస్టిస్‌ బోర్డ్‌ ద్వారా ప్రజలకు న్యాయ సేవలు పొందుతున్నారు. వీటితోపా టు బెల్లంపల్లి, చెన్నూరు, లక్షెట్టిపేటలోనూ న్యాయ సే వలు అందుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం లో ఉన్న కోర్టులన్నీ ప్రస్తుతం అద్దె భవనాల్లో వేర్వేరు ప్రదేశాల్లో కొనసాగుతుండటంతో కొంతమేర ఇబ్బందు లు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం కోర్టుల భవనాలు జా తీయ రహదారికి ఇరువైపులా ఉండటంతో రోడ్డు దాటే సమయంలో కక్షిదారులు, న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ్యామిలీ కోర్టు మంజూరు...

జిల్లాకు ఫ్యామిలీ కోర్టు కూడా మంజూరైనట్లు తెలు స్తోంది. ఫ్యామిలీ కోర్టు మంజూరు కావడం వల్ల జిల్లా ప్రజలకు సేవలు మరింతగా చేరువ కానున్నాయి. జి ల్లా వ్యాప్తంగా ఏడాదిలో సగటున 300 వరకు కేసు లు నడుస్తుండగా, ప్రస్తుతం ఆ విభాగానికి చెందిన వారంతా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు కూడా ఏర్పాటు కానుండటంతో ప్రజల కు రవాణాభారం తప్పనుంది. ఫ్యామిలీ కోర్టుతోపాటు జిల్లాకు భవిష్యత్తులో మరిన్ని కోర్టులు కూడా వచ్చే అవకాశం ఉంది.

ఐదు ఎకరాలు కేటాయింపు...

కోర్టు భవనాల సముదాయం ఏర్పాటు చేసేందుకు ప్రస్తుత కలెక్టరేట్‌ భవనం సమీపంలో ఐదు ఎకరాలను కేటాయించారు. మొదట జిల్లా కేంధ్రంలోని భూదాన్‌ భూముల్లో 5.20 ఎకరాలను కేటాయిస్తూ మున్సిపల్‌ పాలకవర్గం తీర్మాణం చేసింది. ఆ స్థలం అనువుగా లేకపోవడంతో తిరిగి 2014లో జిల్లా కేంద్రంలోని రా ముని చెరువు సమీపంలో సర్వే నెంబరు 406లో అధి కారుల నివాసాల కోసం 1.34 ఎకరాలు, కోర్టుల సము దాయం కోసం 4.30 ఎకాలను కేటాయించారు. అయితే సదరు భూములు భవనాల నిర్మాణాలకు యోగ్యం కా దనే కారణంతో టెండర్లు కూడా పూర్తయ్యాక రద్దు చే శారు. అనంతరం 2017లో నస్పూర్‌ శివారు సర్వే నెం బరు 42లో ఐదెకరాలు కేటాయించగా, అందులోనే కో ర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది.

రేపు శంకుస్థాపన..

జిల్లాకు కోర్టుల సముదాయ భవనం మంజూరు కా వడంతో న్యాయశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న హైకో ర్టు చీఫ్‌ జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ చేతుల మీ దుగా వర్చువల్‌గా శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైకోర్టు జడ్జి నగేష్‌ బీమపాకతోపాటు మంచిర్యాల ప్రిన్సిపల్‌ డిస్టిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి వీర య్య హాజరవుతుండగా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షు డు బండవరం జగన్‌, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణల నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:34 PM