kumaram bheem asifabad- సాగునీటి సంఘాలకు మోక్షం
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:47 PM
సాగునీటి వినియోగదారుల సంఘాలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిర్వ హణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సమరం పూర్తయ్యాక సాగునీటి సంఘాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకొని కన్వీనర్లుగా నీటిపారుదల శాఖ అధికారులను నియమిస్తామని ఇటీవల నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
- సంఘాలకే నేరుగా నిధులు విడుదల
- జలాశయాలకు పూర్వవైభవం
- ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు
బెజ్జూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): సాగునీటి వినియోగదారుల సంఘాలు త్వరలో ఏర్పాటు కానున్నాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిర్వ హణ బాధ్యతను ప్రభుత్వం అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది. స్థానిక సమరం పూర్తయ్యాక సాగునీటి సంఘాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకొని కన్వీనర్లుగా నీటిపారుదల శాఖ అధికారులను నియమిస్తామని ఇటీవల నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వాటి కింద లస్కర్లు పని చేస్తారని తెలిపారు. జిల్లా లో 100ఎకరాలకు పైగా ఉన్న చెరువులు 147, 100ఎకరాల లోపు 416చెరువులు ఉన్నా యి.
- ఉమ్మడి రాష్ట్రంలో..
నీటి వనరుల నిర్వహణలో వారిని భాగస్వాము లను చేయాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 1997లో తొలిసారి సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ అధీనంలోని చెరువులు, ప్రాజెక్టులకు సంఘాలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. నీటా వనరులను స్థానిక రైతులే నిర్వహించుకునే లక్ష్యం తో అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. జలాశయాల పరిధిలో సాగునీటి వినియోగదారుల సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు ఏర్పాటు చేసింది. ఆయకట్టు రైతులు సంఘాలకు సభ్యులు అందులో నుంచి అధ్యక్షులను ఎన్నుకొని కన్వీనర్‌లుగా అధికారులు ఉండి సంఘాలు ఏర్పా టు చేశారు. సంఘాలకు నేరుగా నిధులు విడుదల చేయడంతో కాలువలకు అవసరమైన మరమ్మతు లు, నిర్వహణ పనులు చూసేవి. సంఘాలకు మూడేళ్ల కాలపరిమితి విధించారు. ఆలస్యంగా రెండోసారి 2004లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత 2010లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, అప్పట్లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగు తుండడంతో పాత సంఘాలనే కొనసాగించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి సంఘాలను పట్టించుకోకపో వడం మూలంగా ఎన్నికలు జరగలేదు. తిరిగి కాంగ్రేస్ ప్రభుత్వం వీటి ఏర్పాటుపై మళ్లీ దృష్టి సారించేందుకు చర్యలు తీసుకుంటోంది.
- కోల్పోయిన ఉనికి..
ప్రభుత్వం పట్టించుకున్నంత కాలం చురుగ్గా పని చేసిన సాగునీటి సంఘాలు తర్వాత ఉనికి కోల్పోయాయి. పంట కాల్వల మరమ్మత్తులు, నీటిపారుదల రైతులకు సమస్యగా మారింది. ప్రభుత్వ నిధులతో నిర్వహించే పనుల్లో రైతుల భాగస్వామ్యం, పర్యవేక్షణ లేకపోవడంతో అధి కారులు తూతూ మంత్రంగా కానిచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాల ఏర్పాటు ఉపయోగంగా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాగా ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఏర్పాటు చేసిన సాగునీటి సంఘాలు ఉన్నప్పుడు కాలువలు, చెరువు కట్టలు, తూముల సమస్యలు, మరమ్మ తులు సంఘం సభ్యులే చేసేవారు. భారీ వర్షాలు కురిసినప్పుడు జలవనరులకు నష్టం కలగకుండా సంఘాలు బాధ్యతగా పని చేశాయి. పంట కాలు వలకు క్రమపద్దతిలో సాగు నీరందించేవారు. దీంతో చెరువులు, ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేది.