Share News

సాగునీటి సంఘాలకు మోక్షం...!

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:14 PM

సాగునీ టి సంఘాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సాటు నీటి సంఘాలనుఏర్పాటు చేస్తామన్న ప్ర కటనతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

సాగునీటి సంఘాలకు మోక్షం...!

-మంత్రి ప్రకటనతో చిగురిస్తున్న ఆశలు

-జిల్లాలో 1239 చెరువులు, 27 చెక్‌ డ్యాంలు

-కడెం ప్రాజెక్టు ద్వారా సాగునీరు

-గతంలో టీడీపీ హయాంలో సంఘాల ఏర్పాటు

-మిషన్‌ కాకతీయ పేరుతో అటకెక్కించిన బీఆర్‌ఎస్‌

-ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు మేలు

మంచిర్యాల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): సాగునీ టి సంఘాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సాటు నీటి సంఘాలనుఏర్పాటు చేస్తామన్న ప్ర కటనతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పదేళ్లకు పై గా మనుగడలో లేని సాగునీటి సంఘాలను పునరు ద్ధ రించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించగా, ఈ నెల 29న సచివాలయంలో నీటిపారుదల శాఖ అధి కారుల తో మంత్రి ఏర్పాటు చేసిన సమీక్షలోనూ ఆ అంశాన్ని పునరుద్ఘాటించారు. గతంలో మాదిరిగా సాగునీటి విని యోగ సంఘాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్‌ సమావేశం సంద ర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ కోరిన మేరకు రాష్ట్రంలో మళ్లీ నీటి సంఘాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో ప్రతీ చెరువు కింద ప్రత్యేకంగా సాగునీటి సంఘాన్ని ఏర్పా టు చేయాలనే ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. ఈ పాలక మండళ్లను ప్రస్తుతానికి నామినేషన్‌ విధానంలో నియ మించేందుకు సన్నాహాలు చేస్తోంది.

సాగునీటి సంఘాలంటే..

రైతుల సమూహాలు సాగునీటి అవసరాలను సమ న్వయం చేసుకొని, నీటిని సమర్ధవంతంగా ఉపయో గించుకునేందుకు కలిసి పని చేయడానికి, నీటి పంపిణీ, కాలువల నిర్వహణ, నీటి నాణ్యతా పరిరక్షణకు ఉద్దే శించి ఏర్పాటు చేసేవి సాగునీటి సంఘాలు. నీటి నిర్వ హణలో ఈ సంఘాల పాత్ర ఎంతో ఉంటుంది. సాగు నీటి సంఘాలు ఏర్పాటయితే నీటి నిల్వలు, పంపిణీ షెడ్యూల్‌ నిర్వహణను పకడ్బందీగా అవి అమలు చేస్తా యి. నీటి నాణ్యతను పరీక్షించడంతో పాటు ప్రభుత్వం తో సమన్వయం చేసుకొని, నీటి అభివృద్ధికి సంబంధిం చిన కార్యక్రమాలలో పాలు పంచుకుంటాయి. ఈ సం ఘాలను బలోపేతం చేయడం ద్వారా నీటి వనరు లను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.

రైతు కమిషన్‌ సూచన మేరకు......

సాగునీటి వినియోగదారుల సంఘం వ్యవస్థను పు నరుద్దరించడం వల్ల సాగునీటి వనరులను సక్రమంగా వినియో గించుకోగలుగుతారని వ్యవసాయ రైతు సంక్షే మ కమిషన్‌ అభిప్రాయ పడుతోంది. వాటి బాగోగులు ఎప్పటికప్పుడు చూడగలుగుతామని ప్రభుత్వానికి నివే దించింది. సాగునీటి సంఘాల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర నా యకుల నేతృత్వంలోని బృందం ఇప్పటికే ప్రాథమిక ని వేదికను ప్రభుత్వానికి సమర్పించింది. వీటిపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన క్రమం లో సాగునీటి సంఘాల ఏర్పాటుపై రైతుల్లో ఆసక్తి నెల కొంది. కాలువల మరమ్మతులు, నిర్వహణ పనులను చేయడానికి సాగునీటి సంఘాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వనున్న ధృష్ట్యా నీటి వినియోగంలో ఆవినీతి అక్రమా లకు తావులేకుండా ఉండేందుకు మార్గదర్శకాలను పక డ్బంధీగా రూపొందించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

జిల్లాలో 1239 చెరువులు....

జిల్లాలో చిన్నవి, పెద్దవి కలిపి మొత్తం 1239 చెరు వులు న్నాయి. కడెం ప్రాజెక్టు నీటిని కాలువల ద్వారా ఈ చెరు వుల్లో నింపి జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ వండలాల్లోని సుమారు మూడు వేల ఎకరా ల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. వీటితో పా టు జిల్లా వ్యాప్తంగా 27 వరకు చెక్‌ డ్యాంలు కూడా ఉ న్నాయి. గతంలో కడెం ప్రాజెక్టు పరిధిలో ఈ నీటి సం ఘాలు పనిచేయగా, పదేళ్ల కాలంలో వాటి ఉనికి లే కుండా పోయింది. సాగునీటి పనులను కాపాడటంలో రైతులను భాగస్వాములను చేయాలనే రైతు సంక్షేమ కమిషన్‌ కోరిక మేరకు సాగునీటి సంఘాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

తొలుత చిన్న తరహా సంఘాల ఏర్పాటు...

రాష్ట్రంలో తొలుత ప్రయోగాత్మకంగా చెరువులు, కా లు వలు, తదితర చిన్ననీటి తరహా సంఘాలను ఏర్పా టు చేసి, ఆ తరువాత భారీ ప్రాజెక్టులకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. సాగునీటి సంఘాలకు క న్వీనర్‌గా నీటిపారుదల శాఖ అధికారులు ఉండనున్నా రు. వారి పర్యవేక్షణలో సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎ న్నికల ప్రక్రియ మొదలైనందున, ఆ ఎలక్షన్ల తరువా తనే సాగునీటి సంఘాలు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Sep 30 , 2025 | 11:15 PM