Share News

వేతన.. వెతలు..!

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:21 PM

ఏడాది కాలంగా వేతనాలు అందక ధరణి ఆపరేటర్లు వెత లు పడుతున్నారు. జీతాల కోసం ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లే దని ఆవేదన చెందుతున్నారు. ఎమ్యెల్యేలు, ఎంపీ లు, మంత్రులను కలిసి గోడు వెళ్లబోసుకుని వినతి పత్రాలను సమర్పించినా.. చివరికి సీఎం దృష్టికి తీ సుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది..

వేతన.. వెతలు..!

-ఏడాదిగా జీతాల్లేక ధరణి ఆపరేటర్ల పస్తులు

-ఏజెన్సీ రద్దుతో టీజీటీఎస్‌కు అటాచ్‌

-ప్రభుత్వం నుంచి నేరుగా చెల్లింపు ప్రతిపాదన

-ఆదేశాలు రాక వేతనాలు ఆగిన వైనం

-ఉమ్మడి జిల్లాలో 60 మంది ఆపరేటర్లు

- రూ.కోటికి పైగా బకాయిలు

మంచిర్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఏడాది కాలంగా వేతనాలు అందక ధరణి ఆపరేటర్లు వెత లు పడుతున్నారు. జీతాల కోసం ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన ఉండటం లే దని ఆవేదన చెందుతున్నారు. ఎమ్యెల్యేలు, ఎంపీ లు, మంత్రులను కలిసి గోడు వెళ్లబోసుకుని వినతి పత్రాలను సమర్పించినా.. చివరికి సీఎం దృష్టికి తీ సుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది..

టీజీటీఎస్‌కు అనుసంధానం...

గతంలో టెరాసిస్‌ అనే ఏజెన్సీ ద్వారా ధరణి ఆప రేటర్లకు వేతనాలు అందేవి. గత సంవత్సరం జనవ రిలో ఆ ఏజెన్సీ కాంట్రాక్టు కాలం ముగిసింది. ప్రస్తు త కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ఏజెన్సీ గడువును పెంచ కుండా పక్కనబెట్టింది. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఆరే ళ్లు గా పని చేస్తున్న ఆపరేటర్లను తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్‌ సర్విసెస్‌ (టీజీటీఎస్‌)కు అనుసంధానం చే సింది. ఇకమీదట ఆ ఏజెన్సీ ద్వారానే వేతనాలు చె ల్లించనున్నట్లు తెలిపింది. ధరణి ఆపరేటర్లుగా పని చేస్తున్న వారి వివరాలను ఏజెన్సీకి సైతం అంద జేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి టీజీటీఎస్‌ ద్వారా తమకు వేతనాలు వస్తాయని ఆశపడిన ఆపరేటర్లకు చివరికి ఎదురుచూపులే మిగిలాయి. టెరాసిస్‌ ఏజెన్సీ కింద ఉన్నప్పుడు నెలనెలా వేతనాలు వచ్చేవి. ఇప్పు డు జీతాలు రాకపోగా... ఎప్పుడు వస్తాయో తెలియ ని అయోమయ పరిస్థితి నెలకొంది. మొదట్లో వీరిని తొలగించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినా త ర్వాత మనసు మార్చుకుని, కొత్తవారిని నియమించే బదులు వారినే కొనసాగించాలన్న నిర్ణయానికి వ చ్చింది. టెరాసిస్‌ ఏజెన్సీ నుంచి నేరుగా ప్రభుత్వ ఆ ధ్వర్యంలోని టీజీటీఎస్‌కు తమను అటాచ్‌ చేయడం తో ధరణి ఆపరేటర్లు సంతోషించారు. భవిష్యత్తులో తమ సర్వీస్‌ రెగ్యులర్‌ అవుతుందని ఆశపడ్డారు. వే తనాలు కూడా పెరుగుతాయనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. అసలు వేతనాలే రా వడం నిలిచిపోయింది. ఏం చేయాలో తెలియని ఆని శ్చితిని వారు ఎదుర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో 60 మంది ఆపరేటర్లు...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 60 మంది వరకు ధరణి ఆపరేటర్లు ఉన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కోఆర్డి నేటర్‌ హోదాలో ఒక్కో ఆపరేటర్‌ విధులు నిర్వహి స్తున్నారు. గతంలో కలెక్టరేట్‌లలో కోఆర్డినేటర్‌తో పా టు ఆయనకు సహాయకులుగా ఇద్దరేసి ఆపరేటర్లు (బఫర్స్‌) ఉండేవారు. ఇప్పుడు వారిని తొలగించారు. ప్రస్తుతం కో ఆర్డినేటర్‌తోపాటు మండలాల వారిగా కొనసాగుతున్నారు. ధరణి ఆపరేటర్లకు ఇచ్చే వేత నం కూడా చాలా తక్కువ. వారికి ప్రస్తుతం నెలకు రూ.12,035 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 675 మంది ప్రస్తుతం పని చేస్తున్నారు. మొదట్లో వీరికి రూ.10వేల చొప్పున చెల్లించేవారు. ధరణి కం ప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమితులైనవారిలో అత్యధి కులు ఇంజనీరింగ్‌, ఇతర పట్టభద్రులే అయినప్పటికీ ప్రభుత్వం భవిష్యత్తులో వేతనాలు పెంచుతుందనే ఆశతో విధుల్లో చేరారు. ఏడాదిగా వేతనాలు రాక పోవడంతో కొందరు ఆపరేటర్లు పీఎఫ్‌ డబ్బు డ్రా చేసుకొని జీవితాలను వెళ్లదీస్తున్నారు.

ఆరేళ్ల క్రితం నియామకం...

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం గత ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అన్ని మండలాల్లో తహ సీల్దార్లకు, సంయుక్త సబ్‌ రిజిస్ట్రార్‌లుగా అదనపు బాధ్యతలను అప్పగించి, వ్యవసాయ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ల విధులు కూడా వారికే కేటాయించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తం గా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కో సం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి పరికరాల ను సమకూర్చి..

ఆరేళ్ల క్రితం ఆపరేటర్లను నియమిం చింది. అప్పటి నుంచి టెరాసిస్‌ ఎజెన్సీ ద్వారా వీరు పని చేస్తుండగా, టీజీటీఎస్‌కు అటాచ్‌ చేసినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి.

ఆపరేటర్ల వెట్టి చాకిరి....

కేవలం ఆపరేటర్‌ విధులే కాకుండా, తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, ఎన్నికల సర్వే, కుల, ఆ దాయ ధృవీకరణ పత్రాలు, ఇతరత్రా డేటా ఎంట్రీ కూడా వారితోనే చేయిస్తున్నారు. వేతనం తక్కువగా ఉన్న వారు రకరకాల పనుల కారణంగా వెట్టి చాకి రికి గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించడమేగాక, అవసరమైతే రాత్రి వరకు కూడా పని చేయాల్సివస్తోంది. పైగా మండలానికి ఒక్క ఆపరేటరే ఉండడంతో అత్యవసర పని ఉన్నప్పుడో, ఆనారోగ్యానికి గురైనప్పుడో సెలవు పెట్టాల్సి వస్తే ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు ప డాల్సి వస్తోంది. ఒక మండలం ఆపరేటర్‌ సెలవు పెడితే పక్క మండలం ఆపరేటర్‌తో విధులు నిర్వ హింపజేస్తున్నారు.

రూ. కోటి పై చిలుకు బకాయిలు...

ఒక్కో ఆపరేటర్‌కు రూ.1.50 లక్షల వేతన బకా యిలు రావలసి ఉంది. మొత్తంగా 60 మందికి పైబ డి ఉన్న ఆపరేటర్లకు రూ. సుమారు రూ. కోటి పై చిలుకు బకాయిలు ఉన్నాయి. సమాన పనికి సమా న వేతనం చెల్లించడంతో పాటు ఏడాదిగా పెండిం గ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ప్రతీ నెల వేతనాలను అందించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తు త ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించి నందున ఇప్పటికైనా స్పందించి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని వారు వేడుకుంటున్నారు. జూన్‌ 2021లో వచ్చిన జీవో 63 ప్రకారం తమ వేతనాలు రూ. 31,040కు పెంచాలని కోరుతున్నారు. మహిళా ఆపరేటర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నార

Updated Date - Apr 25 , 2025 | 11:21 PM