Child Protection: 10 మందికి పైగా పిల్లలపై లైంగిక దాడి!
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:55 AM
హైదరాబాద్‌లోని సైదాబాద్ జువైనల్ హోంలో స్టాఫ్ గార్డ్ రహమాన్ చేసిన అకృత్యాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో బాలుడిపై...
సైదాబాద్ జువైనల్ హోం స్టాఫ్‌గార్డుపై మరో పోక్సో కేసు నమోదు
సైదాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సైదాబాద్ జువైనల్ హోంలో స్టాఫ్ గార్డ్ రహమాన్ చేసిన అకృత్యాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో బాలుడిపై లైంగిక దాడికి సంబంధించిన ఫిర్యాదు రావడంతో పోలీసులు రహమాన్‌పై రెండో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, జువెనైల్ శాఖ అధికారులు చేసిన విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు కొంతకాలంగా 10 మందికి పైగా బాలలను బెదిరించి రాత్రివేళల్లో లైంగిక దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిసింది. మొదటి కేసు నమోదైన వెంటనే సైదాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అయితే, ఈ కేసులకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేసి, వివరాలు సేకరించేందుకు రిమాండ్‌లో ఉన్న రహమాన్‌ను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు బుధవారం జువైనల్ హోంను సందర్శించి, పిల్లలకు భరోసానిచ్చారు.