Share News

ఆధ్యాత్మిక కేంద్రంగా సాయిమందిరం

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:16 AM

షిరిడీ సాయిమందిరం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని హాలియా మార్కెట్‌ చైర్మన్‌ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి అన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా సాయిమందిరం

108 కలశాలతో భక్తులు

హాలియా, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): షిరిడీ సాయిమందిరం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని హాలియా మార్కెట్‌ చైర్మన్‌ తుమ్మలపల్లి చంద్రశేఖర్‌రెడ్డి, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా హాలియాలోని షిరిడీసాయిమందిరం 20వ వార్షికోత్సవంలో వారు మాట్లాడారు. సాయిమందిరంలో నిత్యం పూజా కార్యక్రమాలతో పాటు ధ్యాన కేంద్రంగా కూడా భక్తులకు ఉపయోగపడుతుందన్నారు. తెల్లవారుజామున కాగడహారతితో వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమై 108 కలశాలతో శతకటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు సాయిబాబాకు క్షీరాభిషేకం నిర్వహిం చారు. సాయంత్రం హాలియా పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర కోలాటాలు, డప్పు వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామివారి అన్నప్రసాద షెడ్‌ నిర్మాణానికి మాజీ అధ్యక్షుడు మిట్టపల్లి వాసులు రూ.లక్ష విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో ధర్మకర్త మిట్టపల్లి సుబ్బారావు, అధ్యక్షుడు తేలపోలు శేఖర్‌, కార్యదర్శి సక్రునాయక్‌, కోశాధికారి మిట్టపల్లి శివకుమార్‌, కమిషనర్‌ రామదుర్గారెడ్డి, ఎంపీడీవో సుజాత, మిట్టపల్లి వాసులు, వీరమళ్ల కృష్ణయ్య, చీదళ్ల లింగయ్య, భూపాల్‌రెడ్డి, రంగా రంజీత్‌, కుక్కడపు రమేష్‌, శేఖర్‌, యాదగిరి, మంచికంటి శ్రీను, రవీందర్‌, వేణు, చిననారాయణ, ఆంజనేయులు, నాగిరెడ్డి, సోమయ్య, రేపాల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 12:16 AM