Sai Charan Goud: అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా.. ఆర్‌ఎస్‌ఐ
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:50 AM
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పుల్ల రవి-పద్మ దంపతుల చిన్న కుమారుడు...
రఘునాథపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పుల్ల రవి-పద్మ దంపతుల చిన్న కుమారుడు పుల్ల సాయిచరణ్ గౌడ్ గ్రూపు-2లో సత్తా చాటి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో ఆర్‌ఎ్‌సఐగా విధులు నిర్వహిస్తూ గ్రూపు-2 పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 92వ ర్యాంకు సాధించారు. సాయిచరణ్ అన్న సాయికిరణ్ మంచిర్యాల బెటాలియన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తన అన్న, భార్య అక్షిత ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించానని సాయిచరణ్ తెలిపారు.