Share News

kumaram bheem asifabad- పత్తి రైతుకు దుఃఖం

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:17 PM

పత్తి రైతులు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు పెట్టుబ డులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్‌ ప్రారం భంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశలు పెంచు కున్నారు. గతనెలలో కురిసిన ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు పంట దెబ్బతిన్నది. ఆపసోపాలు పడుతూ వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటకు కాపాడుకున్నా దిగుబడులు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

kumaram bheem asifabad- పత్తి రైతుకు దుఃఖం
బెజ్జూరులో సాగు చేస్తున్న పత్తి

- చాలా చోట్ల కుళ్లిపోయిన కాయలు

- భారీగా తగ్గనున్న దిగుబడి

- పెట్టుబడి కూడా రాని దుస్థితి

- ఆందోళనలో అన్నదాతలు

పత్తి రైతులు దుఃఖంలో మునిగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటకు పెట్టుబ డులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వానాకాలం సీజన్‌ ప్రారం భంలో పడిన వర్షాలను చూసి మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశలు పెంచు కున్నారు. గతనెలలో కురిసిన ఎడతెరిపి లేకుండా పడిన వర్షాలకు పంట దెబ్బతిన్నది. ఆపసోపాలు పడుతూ వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటకు కాపాడుకున్నా దిగుబడులు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

బెజ్జూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) వరుణుడి దెబ్బకు పత్తి రైతులు కుదేలవు తున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలు దెబ్బతింటున్నా యి. వానా కాలం ప్రారంభంలో వర్షాలు లేక దిగాలు చెందిన చెందిన రైతులు మధ్యలో వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఇటీవల కురిసిన వరుస వర్షాల తో చేతికి వచ్చిన పత్తి పంటలు తడవడంతో తెల్లబంగారం అంతా నల్లబోవడంతో పత్తి రైతులు బోరుమంటున్నారు. పంట చేతికొచ్చే సమయానికి చేల ల్లోనే నల్లబడ డంతో పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని వాపోతున్నారు. దీనికి తోడు పత్తి తీతకు కూలీ రేట్లు పెంచడంతో పత్తి రైతు ఆందోళన చెందుతున్నాడు. పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని ఆవే దనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు వెక్కిరించిన కరువు స్థానంలో అతివృష్టి నెలకొనడంతో జిల్లా రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసింది.

- సీజన్‌ ప్రారంభంలో..

వానాకాలం సీజన్‌ ప్రారంభంలో వర్షాలు కాస్తా దోబూచులాడినా, వర్షాలు పడిన వెంటనే రైతులు పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 3.50లక్షల ఎకరాలకు పైగా సాగు చేశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా కురిసిన వరుస వర్షాలకు పత్తి పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఒక్కో ఎకరాకు 12క్వింటాళ్ల దిగుబడి వచ్చే పంట అధిక వర్షాలకు 5క్వింటాళ్లకు దిగుబడి పడిపోయింది. పంట ప్రారంభ దశలో పత్తి పంటకు అనుకూలమైన వర్షాలు కుర వడంతో పంట పెట్టుబడికి వెనక్కి పోకుండా అప్పులు తెచ్చి ఎరువులు వేశారు. పంట కు చీడ, పీడలు ఆశి స్తున్న క్రమంలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటలను కాపాడుకున్నారు. తీరా పంట చేతికి వచ్చే సమయానికి వరుస వర్షాలు కురవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి, పత్తి కాయలు మురిగిపోయి దిగుబడి తీవ్రంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

గత నెలలో కురిసిన వర్షాలకు..

సెప్టెంబరులో ఎడతెరపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు పత్తి పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎకరాకు 10నుంచి 12క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అనుకున్న రైతులకు కేవలం ఐదు క్వింటా ళ్లు మాత్రమే వచ్చేలా ఉందని, కొన్నిచోట్ల ఆమాత్రం కూడా దిగుబడి రాలేని స్థితిలో ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల ప్రభావంతో పత్తి నలుపు రంగులోకి మారిందని, దీంతో మార్కెట్‌లో వ్యాపారులు తేమ, నాణ్యత పేరుతో పత్తి ధరను అమాంంతం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలతకొన్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధిక వర్షాలకు తోడు సిర్పూర్‌ నియోజకవర్గంలో ప్రాణ హిత నదికి బ్యాక్‌ వాటర్‌ వరద పోటెత్తడంతో తీర ప్రాంతాల్లోని పత్తి పంట పలుమార్లు వరద నీటిలో మునిగి పోయింది. ఆదిలోనే తీర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోగా, మరోసారి రైతులు విత్తనాలు విత్తుకొని సాగు చేయగా అధిక వర్షాలు మరోసారి నష్టాన్ని మిగిల్చాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పంటలు వరద నీటిలో మునిగిపోగా వ్యవసాయ శాఖ సర్వేలు నిర్వహించి 6,704ఎకరాల్లో పత్తికి నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. కానీ పంట నష్టం జరిగి, సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందజేసి నెలరోజులకు పైగా గడుస్తున్నా ఇప్పటికి పరిహారం రైతులకు అందలేదు.

- అదనపు భారం..

పత్తి రైతులకు పెరిగిన కూలీ రేట్లు మూలిగే నక్క పై తాటికాయ పడినట్లుయింది. అధిక వర్షాలతో దిగు బడి నష్టపోయిన రైతులకు కూలీల రేట్లు పెంచడం అదనపు భారంగా మారింది. ఒక్కో కూలీకి రూ.300ఆటో కిరాయి, రూ.2వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఎకరానికి పత్తితీతకు సుమారు 40నుంచి 50మంది కూలీలు అవసరం పడు తుంది. ఒక్కో కూ లీకి కిలో పత్తి తీతకు రూ.10నుంచి రూ.12వరకు అడుగుతున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా అన్ని ఖర్చులు కలుపుకొని సుమారు రూ.25వేల వరకు అవుతుంది. ఎకరంలో ఐదు క్వింటాళ్ల పత్తి మాత్రమే వస్తుండగా ఇక రైతులకు మిగిలేది ఏం లేదని వాపోతున్నారు.

- మద్దతు ధరపైనే ఆశలు..

పత్తి సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం గా మారింది. నాణ్యత, తేమ సా కు చూపకుండా కేం ద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.8,120చెల్లిస్తేనే రైతుకు పంటపై పెట్టిన పెట్టుబడి వచ్చేలా ఉందని రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధరపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యత, తేమ అని చూడకుండా రైతులకు ప్రభుత్వ మద్దతు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పెట్టుబడులు వచ్చేలా లేవు..

- చటారి హన్మంతు, రైతు, ఎల్కపల్లి

ఈ యేడు పత్తి పంటపై లాభాలు వస్తాయని అ నుకున్నా. అధిక వర్షాలతో పత్తి పంట పూర్తిగా దెబ్బ తిన్నది. ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవు. ప్రభుత్వం మద్ద తు ధర పెంచి సీసీఐ కేంద్రాలను త్వరగా ప్రారంభిం చాలి. పంట నష్టం జరిగిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి.

Updated Date - Oct 26 , 2025 | 10:17 PM