Share News

Rythu Nestham Awards: 26న రైతు నేస్తం పురస్కారాలు

ABN , Publish Date - Oct 18 , 2025 | 04:58 AM

ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం మాసపత్రిక ఆధ్వర్యంలో.. 26వ తేదీన రైతునేస్తం పురస్కారాలు అందజేయనున్నట్లు..

Rythu Nestham Awards: 26న రైతు నేస్తం పురస్కారాలు

హైదరాబాద్‌, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ముప్పవరపు ఫౌండేషన్‌, రైతునేస్తం మాసపత్రిక ఆధ్వర్యంలో.. 26వ తేదీన రైతునేస్తం పురస్కారాలు అందజేయనున్నట్లు రైతునేస్తం ఎడిటర్‌ వై.వెంకటేశ్వరరావు తెలిపారు. వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్న వారికి ప్రతి యేటా రైతునేస్తం పురస్కారాలు పంపిణీ చేస్తున్నామని, 21వ వార్షికోత్సవం సందర్భంగా శంషాబాద్‌ శివారు ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో ఈసారి అవార్డుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తెలిపారు. ఏపీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త కొసరాజు చంద్రశేఖరరావుకు జీవన సాఫల్య పురస్కారం, తెలంగాణకు చెందిన భూమి హక్కుల కార్యకర్త ఎం. సునీల్‌ కుమార్‌కు భూమిరత్న, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు సీఈవో జేఏసీఎ్‌సరావుకు కృషిరత్న బిరుదులు ప్రదానం చేయనున్నట్లు వెంకటేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - Oct 18 , 2025 | 04:58 AM