Share News

Tummala : వరి నాట్ల సమయానికి ‘రైతు భరోసా’

ABN , Publish Date - May 29 , 2025 | 03:39 AM

వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Tummala : వరి నాట్ల సమయానికి ‘రైతు భరోసా’

  • అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

చిట్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.


బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని.. ఆయిల్‌ పామ్‌, వక్క, జాజి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - May 30 , 2025 | 02:56 PM