Share News

హామీల ఊసెత్తని పాలకులు

ABN , Publish Date - Nov 02 , 2025 | 10:45 PM

ప్రభుత్వ పథకా లు ప్రజలకు సక్రమంగా అమలు చేస్తూ కాలం గడుపుతున్న తమకు ఎన్నికల సమయంలో రేషన్‌ డీల ర్లకు ఇచ్చిన హామీల విషయంలో పాలకులు ప్రస్తుతం ఊసెత్తడం లేదని రేషన్‌ డీలర్ల సంఘం మండ ల అధ్యక్షుడు జుంపాల్‌ అన్నారు.

హామీల ఊసెత్తని పాలకులు
గుమ్మకొండ రేషన్‌ దుకాణం దగ్గర లబ్ధిదారులకు సన్న బియ్యం సంచులను పంపిణీ చేస్తున్న రేషన్‌ డీలర్‌ రామకృష్ణ

- రేషన్‌ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు జుంపాల్‌

తిమ్మాజిపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పథకా లు ప్రజలకు సక్రమంగా అమలు చేస్తూ కాలం గడుపుతున్న తమకు ఎన్నికల సమయంలో రేషన్‌ డీల ర్లకు ఇచ్చిన హామీల విషయంలో పాలకులు ప్రస్తుతం ఊసెత్తడం లేదని రేషన్‌ డీలర్ల సంఘం మండ ల అధ్యక్షుడు జుంపాల్‌ అన్నారు. మండలంలోని గ్రామాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యం బస్తాలను ఆయా లబ్ధిదా రులకు డీలర్లు పంపిణీ చేశారు. 8 నెలలుగా కమీషన్లు లేక అవస్థలు పడుతున్నామని, ప్రభు త్వం డీలర్లకు నెలకు గౌరవ వేతనంగా 5000 క్వింటాల్‌కు కమీషన్‌ 140రూపాయలు నుంచి రూ.300కు పెంచాలని, ప్రతీడీలర్‌కు 5లక్షల బీమా వర్తింపజేస్తామన్న హామీని నెరవేరుస్తూ హమాలీ దిగుమతి ఖర్చులు ఇవ్వాలని కోరారు. రేషన్‌ డీలర్లు రామకృష్ణ, కృష్ణారెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 10:45 PM