Share News

Minister Ponnam: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:59 AM

మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 48...

Minister Ponnam: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి

మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల్లోకి వస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు మహిళలు 250 కోట్ల ప్రయాణాలు ఉచితంగా చేశారని తెలిపారు. అనేక సంస్కరణలు చేపట్టామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. చలో బస్‌భవన్‌ అంటూ బీఆర్‌ఎస్‌ నేతలు హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత పదేళ్లలో బంద్‌లు, నిరసనలపై ఉక్కుపాదం మోపిన వారికి చలో బస్‌భవన్‌ నిర్వహించే హక్కు లేదన్నారు. ఆర్టీసీకి రాజకీయ రంగు పులుముతున్న వారిని ప్రజలు గమనించాలని కోరారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సాయికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 04:59 AM