Share News

RTC Special Buses: బతుకమ్మ, దసరాకు 7 వేల బస్సులు

ABN , Publish Date - Sep 24 , 2025 | 03:58 AM

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు....

RTC Special Buses: బతుకమ్మ, దసరాకు 7 వేల బస్సులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు 7 వేలకుపైగా స్పెషల్‌ బస్సులు నడపాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. గత ఏడాది కంటే ఈసారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. టికెట్లను ్టజటట్టఛిఛఠట.జీుఽ లో బుక్‌ చేసుకోవాలని సూచించారు. స్పెషల్‌ సర్వీసుల సమాచారం కోసం 040-69440000, 040-23450033ను సంప్రదించాలని కోరారు.

Updated Date - Sep 24 , 2025 | 08:10 AM