Share News

RTC Employees: దసరా బోనస్‌ ఇవ్వండి

ABN , Publish Date - Sep 11 , 2025 | 05:10 AM

దసరా పండగ సందర్భంగా ఉద్యోగులకు నెల జీతం బోన్‌సగా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం యాజమాన్యాన్ని కోరింది..

RTC Employees: దసరా బోనస్‌ ఇవ్వండి

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దసరా పండగ సందర్భంగా ఉద్యోగులకు నెల జీతం బోన్‌సగా ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం యాజమాన్యాన్ని కోరింది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సిబ్బంది ఎంతో కష్టపడ్డారని, మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలు చేశారని ఉద్యోగ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న తెలిపారు. ఏటా సింగరేణి ఉద్యోగులకు దసరా, దీపావళి పండగలకు ఆనవాయితీగా బోన్‌సలు ఇస్తున్నారని, అదే తరహాలో తమకు ఇవ్వాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 05:10 AM