RSS Chief Mohan Bhagwat: ప్రతిఫలం కాంక్షించి చేస్తే సేవ కాదు
ABN , Publish Date - Dec 29 , 2025 | 02:06 AM
ప్రతిఫలం కాంక్షించి చేసే పనిని సేవ అనరాదని, బలవంతంగా చేసే పని సేవ అనిపించుకోదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు...
బలవంతంగా చేసే పని సేవ అనిపించుకోదు
ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మెహన్ భాగవత్ వ్యాఖ్యలు
కన్హా శాంతివనంలో ముగిసిన విశ్వ సంఘ్ శిబిరం
హైదరాబాద్, డిసెంబర్ 28( ఆంధ్రజ్యోతి): ప్రతిఫలం కాంక్షించి చేసే పనిని సేవ అనరాదని, బలవంతంగా చేసే పని సేవ అనిపించుకోదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్‌సం్‌ఘచాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. పేరును ఆశించి ఇతరులకు చూపించడానికి సేవ చేయడం అహంకారమని, సేవ చేేస వారు కేవలం ేసవ కోసమే ేసవా కార్యక్రమం చేస్తారన్నారు. ేసవ ఓ పవిత్ర కర్తవ్యమని, నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా సేవ చేసేవారే స్వయం ేసవకులని ఆయన చెప్పారు. షాద్ నగర్ సమీపంలోని కన్హా శాంతివనంలో 5రోజుల పాటు జరిగిన 7వ విశ్వ సంఘ్ శిబిరం ప్రపంచ స్థాయి సమ్మేళనంలో 79 దేశాల నుంచి వచ్చిన 1610 మంది కార్యకర్తలు, స్వయం సేవకుల ప్రతినిధులు పాల్గొన్నారు. శిబిరం ముగింపు సందర్భంగా మెహన్ భాగవత్ ప్రసంగించారు. ఆర్‌ఎ్‌సఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ ేసవా తత్పరతతో పనిచేసే సంఘ స్వయం ేసవకులను తయారు చేశారని ఆయన గుర్తు చేశారు. శివజ్ఞానే జీవ ేసవ అంటూ రామకృష్ణ పరమహంస ేసవకు అర్థాన్ని నిర్వచించారని భాగవత్ చెప్పారు. ఐదేళ్లకోసారి వరదలా వచ్చి ఇంటింటికీ తిరుగుతూ తమకు సేవ చేేస అవకాశం కల్పించాలంటూ ప్రజలను ప్రార్ధించి మళ్లీ ఐదేళ్ల దాకా కనిపించరంటూ ఆయన కొందరు రాజకీయ నేతలను ఎద్దేవా చేశారు. స్వయం ేసవకులు విదేశాలకు వెళ్లినా హిందూ ధర్మ సంరక్షణను మరిచిపోలేదని భాగవత్ గుర్తు చేశారు. విదేశాల్లో ఉన్న వారంతా భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని, ఆచరణ పద్థతులను చూసి, ఎలా జీవించాలో నేర్చుకోవాలన్నారు. మనం ఎలా బతకాలో పూర్వీకులు నిర్దేశించార ని అలాంటి ఉదాహరణను ప్రపంచం ముందుంచి, ప్రతి చోటా ధర్మాన్ని ప్రతిష్ఠ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మన సైనిక శక్తిని ప్రదర్శించో, మన ఆర్థిక వ్యవస్థ ద్వారా ఇతరులను అణగదొక్కో ఎదగాలని భావించమన్నారు. మన జీవన పద్థతుల ద్వారానే నేతృత్వం వహిస్తూ మన జీవన పద్థతులను ప్రపంచం ముందు వుంచుతామని భాగవత్ చెప్పారు.