ఆలయాల అభివృద్ధికి రూ.8.47 కోట్ల మంజూరు
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:20 PM
కొల్లాపూర్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి రూ. 8. 47కోటల నిధులు మంజూర అయ్యాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
కొల్లాపూర్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ నియోజకవర్గంలోని పురాతన ఆలయాల అభివృద్ధికి రూ. 8. 47కోటల నిధులు మంజూర అయ్యాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సహకారంతో కొల్లాపూర్ ని యోజకవర్గంలో మహిమ గల రామ మందిరం ఆలయ అభివృద్ధికి రూ.2.37కోట్లు, కొల్లాపూర్ పట్టణంలో బండాయగుట్ట వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి రూ.కోటీ 30 లక్షలు, పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో ఆలయాల సముదాయం అభివృద్ధికి రూ. 4.80కోట్లు పర్యాటక శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
అదే విధంగా కోడేరు మండలం రాజాపూర్ నుంచి వయా ఏదుల వరకు 7కిలో మీటర్ల రహదారితో పాటు ఎన్‌హెచ్ 167 కె జాతీయ రహదారి నుంచి ఖానాపూర్ వయా గంట్రావ్‌పల్లి మీదుగా నారాయణపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సీఆర్‌ఐఎఫ్ పథకం నుంచి రూ.25కోట్లు రోడ్ల అభివృద్ధికి మంజూరయ్యాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.