Share News

రైల్వేల అభివృద్ధికి రూ. 80వేల కోట్లు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:58 PM

తెలం గాణలో రైల్వేల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 42 వేల కోట్లు ఖర్చు చేశామని, రాబోయే పదేళ్లలో రూ. 80వేల కోట్లతో పనులు చేపట్టబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.

రైల్వేల అభివృద్ధికి రూ. 80వేల కోట్లు

-పదేళ్లలో తెలంగాణకు రూ. 42వేల కోట్లు ఇచ్చాం

-కేసీఆర్‌ వైఖరితో పదేళ్లపాటు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రాక విద్యార్థుల తిప్పలు

-రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కాంగ్రెస్‌ రూ. 8వేల కోట్లు చెల్లించలేదా..?

-ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు వైద్యం అందడంలేదు

-మోదీ నాయకత్వంలో 2026 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మిలిస్తాం

-మంచిర్యాలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

మంచిర్యాల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలం గాణలో రైల్వేల అభివృద్ధికి ఇప్పటి వరకు రూ. 42 వేల కోట్లు ఖర్చు చేశామని, రాబోయే పదేళ్లలో రూ. 80వేల కోట్లతో పనులు చేపట్టబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. నా గ్‌పూర్‌-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్‌ ఇచ్చిన సందర్భంగా సోమవా రం రైల్వే స్టేషన్‌కు వచ్చిన రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించా రు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీ డియాతో మా ట్లాడుతూ మోదీ పాలనలో రైల్వే వ్యవస్థ రూపురేఖలే మారిపోయాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని, త్వరలో మరో రెండు రైళ్లు రాబోతున్నాయన్నారు. మంచిర్యా లలో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలేక ప్రజలు ఇబ్బందులు పడు తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ. 3.5 కోట్ల వ్యయంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మంజూరు చేస్తానని తెలిపారు.

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇయ్యని కార ణం గా లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూర మ య్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కేసీఆర్‌కు, కాంగ్రెస్‌కు తేడా ఏముందని, ఆనాడు చెక్కులిచ్చి బౌన్స్‌ చేసి ప్రజలను పిచ్చోళ్లను చేస్తే, ప్రస్థుతం కాంగ్రెస్‌ టోకెన్లు ఇస్తూ మోసం చేస్తోందే తప్ప పైసలియ్యడం లేదన్నా రు. మూసీ సుందరీకరణ, ఫోర్త్‌సిటీ, మిస్‌ వరల్డ్‌ పోటీ లకు వేల కోట్లు ఖర్చు పెడతారు....పేద విద్యార్థుల రీ యింబర్స్‌మెంట్‌ కోసం రూ. 8వేల కోట్లు బడ్జెట్‌లో పె ట్టలేరా...? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ చేయడంపైనా కేంద్ర మం త్రి తీవ్ర స్థాయిలో స్పందించారు. దేశాన్ని రక్షించే ఆర్మీ, చట్టాన్ని కాపాడే పోలీసుల చేతుల్లోనే తుపాకీ ఉండా లని, అలా కాకుండా ఎవరి చేతిలో తుపాకీ ఉన్నా సం ఘ విద్రోహ శక్తిగానే భావిస్తామన్నారు. అందుకే తుపా కీ విడిచి లొంగిపోవాలని కోరుతున్నామన్నారు. నరేం ద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్‌షా నాయకత్వంలో 2026 మార్చి నాటికి మావో యిస్టులను పూర్తిగా నిర్మూలించి తీరుతామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో యూరియా కొరత ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల మ్యేనన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడం, యూరియాను బ్లాక్‌ మార్కె ట్‌కు తరలిస్తున్నా చర్యలులేక పోవడంవల్లే ఈ దుస్థితి తలెత్తింద న్నారు. రాష్ట్రంలో పేదోడు బతికే పరిస్థితి లేదని, రోగమొస్తే పట్టించు కునే నాథు డే లేకుండా పోయారని బండి సంజయ్‌ అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం త మదేనని జబ్బలు చర్చుకున్న కాంగ్రెసోళ్లు బకాయిలు ఇవ్వక పోవడంతో రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు రానియ్యడం లేదన్నారు. పోనీ సర్కారు దవాఖానాకు పోదామంటే సూది, మందుబిల్లలు లేవన్నారు.

రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి

మంచిర్యాల కలెక్టరేట్‌ : రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్య క్ర మాలతో పాటు పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలుపుదల చేసేందుకు కృషి చే స్తామని బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. అనంతరం రైల్వేస్టేషన్‌ ఆవ రణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం చే స్తున్న అభివృద్ధిపై పలు పార్టీలు విమర్శలు చేయడం హాస్యా స్పదమని, దేశంలో అవినీతి, అక్రమాలు లేకుండా నవశకానికి నాంది పలుకుతూ దేశంలో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తుంది నరేంద్ర మోదీ ప్రభుత్వ మేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెర బెల్లి రఘునాథ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, రైల్వే డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌, డీసీపీ భాస్కర్‌, ఏసీపీ ప్రకాష్‌, బీజేపీ రామగుండం ఇన్‌చార్జీ కందుల సంధ్యారాణి, పోచం, కేవీ ప్రతాప్‌, మంచిర్యాల రైల్వేస్టేషన్‌ మేనేజర్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ ఇప్పించాలి...

మంత్రి వివేక్‌

శబరిమల భక్తుల కోసం మంచిర్యాలలో కేరళ ఎక్స్‌ ప్రెస్‌ రైలుకు హాల్టింగ్‌ ఇప్పించాలని రాష్ట్ర గనులశాఖ మంత్రి గడ్డం వివేకానంద కేంద్ర మంత్రి బండి సంజ య్‌కు విజ్ఞప్తి చేశారు. వివేకానంద మాట్లాడుతూ రా మగుండం, క్యాతనపల్లిలో రెండు ఓవర్‌ బ్రిడ్జిలు మం జూరు చేయించినట్లు తెలిపారు. తాను ఎంపీగా ఉన్న ప్పుడు సికింద్రాబాద్‌-బెల్లంపల్లి మధ్య ఇంటర్‌సిటీ ఎక్స్‌ ప్రెస్‌ను ప్రారంభించానన్నారు. రామగుండం ఫర్టిలైజ ర్స్‌ను రూ. 10వేల కోట్లతో తామే రీఓపెన్‌ చేయించి నట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌లతో కలిసి వందే భారత్‌ రైలు ను జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి, మంత్రి, ఎంపీ లకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు.

రెండేళ్లుగా ప్రయత్నం.... ఎంపీ వంశీకృష్ణ

మంచిర్యాలలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్‌ ఇప్పించేందుకు తాను రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నానని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఎట్టకేలకు తన ప్రయత్నం ఫలించిందని, వందే భారత్‌ హాల్టింగ్‌ కల్పించినందుకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్య వావాలు తెలిపారు. కొత్త రైళ్ల మంజూరు కోసం తన తాత కాకా వెంకటస్వామి, తండ్రి వివేక్‌ చేసిన కృషిని తాను కొనసాగిస్తున్నానన్నారు.

Updated Date - Sep 15 , 2025 | 11:59 PM